– కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి
ఢిల్లీ: కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తన అధికారిక నివాసంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేశారు. అంతకుముందు సీఆర్పీఎఫ్ జవాన్ల గౌరవ వందనాన్ని స్వీకరించిన కేంద్రమంత్రి, జెండా ఎగురవేసిన అనంతరం వారందరికీ మిఠాయిలు పంచారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘భారత 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా.. దేశ, విదేశాల్లో ఉన్న భారతీయులందరికీ హార్దిక శుభాకాంక్షలు. గ్రామ సర్పంచ్ నుంచి ప్రధానమంత్రి వరకు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై మూడురంగుల జెండా ఎగురవేసి ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
వేలమంది బలిదానంతో మనం స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నాం. వారందరి త్యాగ ఫలితంతో.. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశం వికసిత భారత నిర్మాణం దిశగా పనిచేయాలి. ఈ ఆత్మనిర్భర భారత నిర్మాణంలో భాగంగా.. రాజకీయాలకు అతీతంగా మనమంతా.. పేదరిక నిర్మూలన, నిరుద్యోగాన్ని తగ్గించడం తదితర అంశాల్లో నరేంద్రమోదీ గారి నేతృత్వంలో కృషిచేయాలి. ఇవాళ దేశంలో కొందరు దేశహితాన్ని విస్మరించి రాజకీయాలు చేస్తున్నారు. ఇది సరికాదు. భారతదేశాన్ని విశ్వగురు గా మార్చేందుకు మనమంతా కలిసి పనిచేయాలని కోరుతున్నాను.’ అని పేర్కొన్నారు.