– ప్రమాదపుటంచున ఆటవిడుపు
తాడేపల్లి: సరదాలు తీవ్ర విషాదానికి దారి తీయచ్చు.. పెద్దలే దగ్గరుండి మరీ పిల్లల ప్రాణాలతో చెలగాటాలు.. ప్రకాశం బ్యారేజి దిగువున కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ప్రమాదకర స్థాయి లో ప్రవహిస్తుంది. సెలవు రోజు కావడంతో పిల్లా.. పెద్దా అనే తేడా లేకుండా వందల మంది సీతానగరం ఘాట్ల వద్దకు వస్తున్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న నది అంచులు వద్దకు వెళ్లి…ఫోటోలు, వీడియోలు దిగడం…ఆటలాడడం వంటివి చేస్తున్నారు. ఏవైనా అనుకోని సంఘటనలు జరిగితే బాద్యులెవరు? స్థానిక మత్స్యకారులే…నది వైపు వెళ్లే సాహసం చేయడం లేదు. నది ఇంత ప్రమాదకర స్థాయి లో ప్రవహిస్తున్నా… ఇక్కడ రక్షణ చర్యలు లేవు. పోలీసు, రెవెన్యూ యంత్రాంగాలు వచ్చి పరిశీలించి వెళ్తున్నాయి. కానీ పర్యవేక్షణ లేదు.గస్తీ లేదు.