న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉదారంగా అర్థిక సాయం అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఆంధ్రాలో అభివృద్ధి పనుల పురోగతిని వివరించిన లోకేష్… కొత్త ప్రాజెక్టులకు సహకారం అందించాల్సిందిగా నిర్మలా సీతారామన్ కు విజ్ఞప్తిచేశారు.