– ఏ హోదాలో రాహుల్ తెలంగాణ హెలికాప్టర్ ను బీహార్ ఎన్నికల్లో వాడుతున్నారు?
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణాలో మన మంత్రులు, బయట వీళ్ళ జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డగోలుగా మన తెలంగాణ ప్రభుత్వ హెలికాప్టర్ ను ఆర్టీసీ బస్సును వాడినట్టు వాడుతున్నారు. అయినా, తెలంగాణ ప్రభుత్వ అధికారిక హెలికాప్టర్ ని ఏ హోదాలో రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే బీహార్ ఎన్నికల్లో వాడుతున్నారు? రాజ్యాంగం పట్టుకొని ఊరేగే రాహుల్ గాంధీ కి ఇది చట్ట విరుద్ధం అని తెల్వదా?
స్కాలర్షిప్ లు, ఫీజు రీయింబర్స్మెంట్ లు ఇవ్వమంటే డబ్బులు ఉండవు. కానీ, అత్త సొమ్మును అల్లుడు దానం చేసినట్టు సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా, అనధికారికంగా తెలంగాణ ప్రజల కష్టార్జితాన్ని దోచి దేశమంతా కాంగ్రెస్ పార్టీ కోసం పంచి పెడుతున్నారు. కెసిఆర్ నేను కాపలా కుక్కలా ఉంటా అంటే ఏందో ఇప్పుడిప్పుడే చాలా మందికి అర్ధమవుతుంది. తెలంగాణ బిడ్డలుగా మనం ఇంకా జాగృతం కావాలి.