- 3 వేదికలు 32 మ్యాచులు
- ఏపీఎల్ లో మరోసారి అలరించనున్న ఐపీఎల్ ఆటగాళ్లు
- జూన్ 9 నుండి విశాఖ వేదికగా ఏపీఎల్ ప్రారంభం
- ఫైనల్ మ్యాచ్‌కు వేదికగా మంగళగిరి
- ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏపీఎల్) పూర్తి షెడ్యూల్ విడుదల
విజయవాడ: దేశవ్యాప్తంగా ఐపీఎల్ కు ఏ విధమైన ప్రాధాన్యత సంతరించుకుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎల్ కు ప్రతి సంవత్సరం అభిమానుల ఆదరణ పెరుగుతూ వస్తుంది ఈ తరుణంలోనే ఏపీఎల్ ఐదవ సీజన్ షెడ్యూల్ ను విడుదల చేశారు ఈసారి మూడు వేదికలలో ఏపీఎల్ ను జరపాలని గవర్నింగ్ కౌన్సిల్ మరియు ఏసీఏ నిర్ణయం తీసుకుంది.
విశాఖపట్నం కడప మంగళగిరి వేదికలుగా 32 మ్యాచులు జరగనున్నాయి జూన్ 9 నుండి ఐపీఎల్ 5వ సీజన్ ప్రారంభం కానుంది మూడు వేదికల్లోనూ డే అండ్ నైట్ మ్యాచులు జరగనున్నాయి జూన్ 9 నుండి 14 వరకు విశాఖ వేదికగా 11 మ్యాచులు జరగనున్నాయి. జూన్ 17 నుండి 21 వరకు కడప వేదికగా 9 మ్యాచ్‌లు జరగనున్నాయి.
మంగళగిరి వేదికగా జూన్ 24 నుండి 30వ తారీకు వరకు 12 మ్యాచ్‌లు జరగనున్నాయి ప్లేయర్ల ప్రయాణ మరియు విశ్రాంతి కి నాలుగు రోజులు కేటాయించారు ఏపీఎల్ ను మరింతగా అభిమానుల ఆదరాభిమానాలు జరగనే విధంగా ఎస్ సి ఏ మరియు ఏ పీ ఎల్ గవర్నమెంట్ కౌన్సిల్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోనుంది
ఈసారి మ్యాచ్ లన్ని జియో హాట్ స్టార్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనున్నట్లు ఏ సి ఏ తెలిపింది ఏసీఏ అధ్యక్షుడు కేశినేని చిన్ని సెక్రటరీ సానా సతీష్ బాబు సతీష్ బాబు ఏపీఎల్ ద్వారా కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేసే విధంగా కొత్తవారికి అవకాశాలు కల్పించే విధంగా ఏసీఏ దోహదపడుతుందని తెలిపారు.
మరోవైపు ఐపీఎల్లో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నుండి పలు ఐపిఎల్ టీమ్స్ లో ఆడుతుఅద్భుత ప్రదర్శన కనపరిచిన రికీ భూయ్, బండారు అయ్యప్ప, ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ తరపున డెబ్యూ చేసిన త్రిపురణ విజయ్, పంజాబ్ టీం సభ్యుడిగా ఉన్న పైలా అవినాష్ అండర్ 19 ఇండియా టీం లో ఆడినటువంటి రషీద్ లాంటి ప్లేయర్స్ ఏపీఎల్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు
గత సీజన్స్ అన్నిటిలో ఏపీఎల్ విశాఖపట్నం స్టేడియం వేదికగానే మ్యాచ్ లన్ని నిర్వహించారు ఈసారి రాష్ట్రంలోని అన్ని స్టేడియంస్ను డెవలప్ చేసే విధంగా కడప మంగళగిరి స్టేడియం ల లోను మ్యాచులు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు ఇటు మంగళగిరిలో అయితే మాత్రం ప్రత్యేకంగా ఏసీఏ అధ్యక్షుడు శివనాద్ నేతృత్వంలో మంగళగిరి స్టేడియం పనులు శరవేగంగా పూర్తి చేస్తున్నారు.
ఇటీవలే స్టేడియం వరకు రోడ్డు బాగు చేయించడంతోపాటు స్టేడియం కు ఫ్లడ్ లైట్ల ను ఏర్పాటు చేశారు ఈసారి ఫైనల్ మ్యాచ్ కూడా మంగళగిరిలోనే జరగడంతో మంగళగిరిలో కూడా మంచి ఇంటర్నేషనల్ తరహా మ్యాచ్ లు నిర్వహించేందుకు క్రికెట్ స్టేడియం సిద్ధం చేయాలని నిర్ణయం తీసుకున్నారు అందుకు ప్రారంభంగా ముందుగా ఏపిఎల్ దేశవాళీ మ్యాచ్‌లు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. మొత్తానికి ఏ పీ ఎల్ ఫీవర్ ఆంధ్ర క్రికెటర్ అభిమానుల్లో మొదలైంది.