– ప్రెస్ మీట్ లు పెట్టుడు కాదు.. వచ్చి కల్లాలలో రైతులతో మాట్లాడండి
రైతుల దుఃఖం వృధాగా పోదు
– రైతుల దుఃఖం వృధాగా పోదు
– సుతులి తాడు నుంచి మొదలుపెట్టి మిల్లులో దించేంతవరకు మొత్తం కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇస్తుంది
– మిల్లర్లకు ఆ ధాన్యం మిల్లింగ్ చేసినందుకు కూడా డబ్బులు ఇస్తుంది
– బ్రోకర్ గిరి చేసే రాష్ట్ర ప్రభుత్వం… కేంద్రం కొంటుందా అని ప్రశ్నించడం సిగ్గుచేటు
– డ్రైవర్ను సస్పెండ్ చేయడం కాదు బిడ్డ. రేపు నీ ప్రభుత్వాన్ని సస్పెండ్ చేస్తారు
– రైతు గోస – బిజెపి భరోసా కార్యక్రమంలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ములుగులో రైతులతో సమావేశమైన మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్
ములుగు: భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు, శాసనమండలి, పార్లమెంట్ సభ్యుల బృందం నిన్న ఉదయం 11 గంటలకు కుల్కచర్ల నుండి మొదలుపెట్టి నీరుకుల వరకు రావడం జరిగింది. రంగారెడ్డి, మెదక్, గజ్వేల్, వరంగల్ జిల్లాలో 45 రోజులుగా బస్తాలు లేవు, హమాలీలు లేరు, దిక్కుతోచని పరిస్థితుల్లో భార్యా పిల్లలతో వడ్ల దగ్గరనే ఉంటున్నాం అంటున్నారు. రైతులు ఈ కష్టం పడలేక క్వింటాకు 600 రూపాయల తక్కువ ధరకు ధాన్యం అమ్ముకునే పరిస్థితి వచ్చిందని చెబుతుంటే కడుపు తరుక్కుపోతోందని, మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈటల ఇంకా ఏమన్నారంటే.. ఒక ఎకరానికి పది బస్తాలు కౌలిచ్చి పండించుకుంటుంటే… అప్పుల కుప్ప, ఆత్మహత్య తప్ప ఇంకొక పరిస్థితి లేదంటున్నారు. మేము నిన్నటి నుండి తిరుగుతుంటే.. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ లు పెడుతున్నారు. ప్రెస్ మీట్ లు పెట్టుడు కాదు మీరు వచ్చి కల్లాలలో రైతులతో మాట్లాడండి.
రైతులందరూ కూడా బిజెపి నాయకులు ఏం చెప్తున్నారు? మీరేం చెప్తున్నారు అంతా గమనిస్తూనే ఉన్నారు. చివరకు న్యాయ నిర్ణేతలు వాళ్లే కనుక తప్పకుండా మీ భరతం పడతారాని హెచ్చరిస్తున్నాను. రైతులే సుతులి దారాలు, ట్రాన్స్పోర్ట్, హమాలి ఖర్చులు, 40 కిలోలకు నాలుగు కేజీలు తరుగు తీసినా భరాయిస్తున్నారు. రైతుల దుఃఖం వృధాగా పోదని హెచ్చరిస్తున్నాను. వారం రోజుల్లో వడ్లన్నీ కొనుగోలు చేయకుండా సతాయించే ప్రయత్నం చేస్తే మీ ప్రభుత్వాన్ని పాతాళంలోకి తొక్కుతారని హెచ్చరిస్తున్నాను.
నిన్న ఒక మంత్రి స్టేట్మెంట్ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం వడ్లు కొంటలేదని.. శుద్ధ తప్పు అది. నేను కూడా ఆ శాఖకు మంత్రిగా పనిచేశాను. ఇక్కడ సుతితాడు నుంచి మొదలుపెట్టి మిల్లులో దించేంతవరకు మొత్తం కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇస్తుంది. మిల్లర్లకు ఆ ధాన్యం మిల్లింగ్ చేసినందుకు కూడా డబ్బులు ఇస్తుంది. నిలువ ఉంచినప్పుడు తరుగు వస్తే తరుగు కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. బియ్యం ట్రాన్స్పోర్ట్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. గోడౌన్ ఖర్చు కూడా కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇస్తుంది. కేవలం లెక్కలు రాసి పంపితే పైసలు తెచ్చుకునే బ్రోకర్ గిరి చేసే రాష్ట్ర ప్రభుత్వం… కేంద్రం కొంటుందా అని ప్రశ్నించడం సిగ్గుచేటు.
ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదు. భూముల పైరవీలు, డబ్బులు సంపాదించుకోవడం… ఆ సంచులు ఢిల్లీకి పంపడం వాటి మీద ఉన్న ధ్యాస కోట్లమంది రైతుల పక్షాన లేదని అర్థమవుతుంది. తెలంగాణ రైతులారా వారు మాట్లాడే మాటలు మేము మీ దగ్గరకు వచ్చి మాట్లాడే మాటలు చూడండి ఎవరు దుర్మార్గులో, మోసగాల్లో, మాటతప్పేవారు అర్థం చేసుకోమని కోరుతున్నాను.
జగిత్యాల లో ఆర్టీసీ డ్రైవర్ను ఒడ్లు కొనండి అంటే సస్పెండ్ చేశారు.. డ్రైవర్ను సస్పెండ్ చేయడం కాదు బిడ్డ. రేపు నీ ప్రభుత్వాన్ని సస్పెండ్ చేస్తారు. నీ బాబు జాగిర్ అనుకుంటున్నావా… గతంలో ఉన్న ప్రభుత్వం ఇలానే చేసింది మట్ట కలిసి పోయింది మీరు కూడా అలానే మట్ట కలిసిపోతారు.