– మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ : భారత ఐటీ,టెలికం రంగాల పితామహుడు స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వారికి ఘన నివాళులు అర్పించారు. భారత్ లో టెక్నాలజీ ను తీసుకొచ్చిన రాజీవ్ గాంధీ గారిని ‘కంప్యూటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తారు.
ఆయన హయాంలోనే దేశంలో ఐటీ, టెలికాం విప్లవానికి పునాదులు పడ్డాయని 21వ శతాబ్దిలో దేశాన్ని కొత్త దిశగా నడిపించి దిశానిర్దేశం చేశారనీ మంత్రి పొన్నం ప్రభాకర్ స్మరించుకున్నారు.
దేశ ప్రధానిగా, ప్రతిపక్ష నేతగా యువతరంలో శక్తిమంతమైన మార్పును రాజీవ్ గాంధీ ఆకాంక్షించారు. ప్రపంచంతో దేశం పోటీపడేలా అడుగులు వేశారు. ఆచరణలో నేటి తరానికి మార్గదర్శిగా నిలిచారు. భారత్ 7వ ప్రధానమంత్రిగా 1984 నుంచి1989 వరకు సేవలందించారు. తనకు ఇష్టమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై దృష్టి పెట్టి దేశాన్నీ అంతర్జాతీయ స్థాయిలో ఎదిగేలా చేశారు.
40 ఏండ్ల వయసులో రాజీవ్ గాంధీ భారత యువ ప్రధాని గా భాధ్యతలు చేపట్టారు. దేశ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని సంకల్పించారు అందుకే ఓటు వేసే హక్కు వయసును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించారు. 1986 లో కొత్త జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చి దళిత , గిరిజన, మహిళలకు విద్యలో సమాన అవకాశాలు కల్పించారు. ప్రజా పాలన ప్రభుత్వం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాజీవ్ గాంధీ ఆశయాలను ముందుకు తీసుకుపోతున్నాం.