• బస్ స్టేషన్ లో ముఖ్యమంత్రికి జేజేలు పలుకుతున్న మహిళలు
• స్త్రీ శక్తితో మహిళలకు ఆర్థిక వెసులబాటు
• విజయవాడ బస్టేషన్ నుంచి ఉండవల్లి వరకు మంత్రి ప్రయాణం
– బీసీ, ఈడబ్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖల మంత్రి ఎస్. సవిత
విజయవాడ: స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకంతో మహిళల్లో ఆర్థిక స్వాతంత్ర్యం పెరిగిందని రాష్ట్ర బీసీ, ఈడబ్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖల మంత్రి ఎస్. సవిత తెలిపారు. బుధవారం పండిట్ నెహ్రూ బస్టేషన్ లో స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకంపై మహిళల అభిప్రాయాలను మంత్రి ఎస్. సవిత అడిగి తెలుసుకున్నారు. అనంతరం విజయవాడ బస్టేషన్ నుంచి అమరావతి వెళ్లే బస్సులో ఉండవల్లి వరకు మంత్రి ప్రయాణించారు.
ఈ సందర్భంగా మంత్రి మహిళా ప్రయాణికులతో ప్రభుత్వ పథకాల గురించి, స్త్రీ శక్తి పథకం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎస్. సవిత మీడియాతో మాట్లాడుతూ మహిళలను గౌరవించే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు.
ఆకాశంలో సగం అవనిలో సగం అంటూ మహిళలు కూటమి పాలనలో స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించటం ఆనందంగా ఉందన్నారు. బస్ స్టేషన్ లో అవ్వని, అమ్మనీ, ఎవ్వరిని పలకరించినా ఆనందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కు జేజేలు పలుకుతూ, హృదయ పూర్వకంగా అభినందనలను అందిస్తున్నారన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రారంభించిన స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం వల్ల మహిళలు ఎంతో ఆనందంతో బస్సుల్లో ప్రయాణించడం చూస్తుంటే ఎంతో ఆనందంగా కల్గుతుందన్నారు. సూపర్ సిక్స్ లో ఇప్పటికే ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకాలను అమలు చేయడం జరుగిందని, పెన్షన్ లను అందించడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళలకు రిజర్వేషన్లు కల్పించారన్నారు.
స్త్రీ శక్తికి ఎదురులేదని వారు ఆర్థికంగా స్థిరపడే విధంగా వారికి అవకాశాలు కల్పిస్తామన్నారు. మహిళలకు అవకాశాలిస్తే అద్భుతాలు సృష్టిస్తారన్నారన్నారు. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు నెలకు కనీసం రూ. 3,000 వరకు ప్రయాణ ఖర్చు ఆదా అవటంతోపాటు ఏడాదికి రూ. 36,000 ప్రయాణ ఖర్చు కలిసి వస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం మహిళల సంక్షేమం కొరకు కృషి చేస్తోందన్నారు. అన్న క్వాంటీన్ల ద్వారా 5 రూపాయలకే భోజనం, టిఫిన్ అందిస్తున్నామన్నారు.