– నక్సలిజానికి పరోక్ష ఊతమిచ్చిన సుదర్శన్‌రెడ్డి
– ఆయనిచ్చిన సల్వాజుడుం తీర్పు వల్లే దేశంలో ఏడేళ్ల నక్సల్ ఉగ్రవాదం
– ఇండి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డిపై హోంమంత్రి అమిత్‌షా సంచలన ఆరోపణలు
ఢిల్లీ: ఇండియా కూటమి అభ్యర్థి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి తన తీర్పు ద్వారా నక్సలిజానికి పరోక్షంగా ఊతమిచ్చారని, ఆయన నక్సలిజం మద్దతుదారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన ఆరోపణలు చేశారు.
శుక్రవారం ఢిల్లీలో జరిగిన మనోరమ న్యూస్ కాన్క్లేవ్లో అమిత్ షా మాట్లాడుతూ, జస్టిస్ సుదర్శన్ రెడ్డి నక్సలిజానికి సహకరించిన వ్యక్తి. ఆయన ఇచ్చిన సల్వా జుడుం తీర్పు వల్లే దేశంలో నక్సల్ ఉగ్రవాదం ఏళ్లపాటు కొనసాగింది. ఒకవేళ ఆ తీర్పు రాకపోయి ఉంటే, 2020 నాటికే నక్సలిజాన్ని పూర్తిగా తుడిచిపెట్టేవాళ్లం అన్నారు.
కాంగ్రెస్ పార్టీ వామపక్షాల ఒత్తిడికి తలొగ్గి ఇలాంటి వ్యక్తిని అభ్యర్థిగా నిలబెట్టిందని, సుప్రీంకోర్టు వంటి పవిత్రమైన వేదికను దుర్వినియోగం చేసిందని అమిత్ షా విరుచుకుపడ్డారు.