– జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కోదండరామ్ ను నిలబెట్టు
– ఉస్మానియా యూనివర్సిటీలో రేవంత్ సొల్లు పురాణం
– రేవంత్ రెడ్డి చంపింది జింకలు, నెమళ్లను
– రేవంత్ రెడ్డి చంద్రబాబు సంకల్లో ఉన్నారు
– పార్లమెంట్‌లోనే కేంద్ర మంత్రి తెలంగాణ అప్పులు రూ.3,50,520 కోట్లని స్పష్టంగా చెప్పారు
– కోదండరామ్ ని నిజంగా గౌరవిస్తే ఇప్పటికిప్పుడు ఎమ్మెల్సీగా చేసి చూపించాలి
– రేవంత్ రెడ్డిని హీరోగా పెట్టి ఆహా నా పెళ్ళంట సినిమా తీయాలి
– సీఎం రేవంత్‌పై బిఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఫైర్
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం పూర్తిగా సొల్లు పురాణాలతో నిండి ఉంది. రాష్ట్రానికి, ప్రజలకు మేలు చేసే అంశాలపై మాట్లాడకుండా అబద్ధాలు, వాస్తవం లేని మాటలతో మభ్యపెట్టే ప్రయత్నం చేశారు.
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సావాస దోషాలతోనే రేవంత్ రెడ్డి లైన్లో నడుస్తున్నారని నిరూపితమవుతోంది. అప్పుల విషయంలో కూడా ఆయన అబద్ధాలు చెబుతున్నారు. పార్లమెంట్‌లోనే కేంద్ర మంత్రి తెలంగాణ అప్పులు రూ.3,50,520 కోట్లని స్పష్టంగా చెప్పారు. పార్లమెంట్ లో రఘునందన్ రావు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి అప్పులపై సమాధానం ఇచ్చారు
రేవంత్ రెడ్డి సీఎం పదవిని వదిలి గడ్డం ప్రసాద్ కుమార్ లేదా కోదండరామ్‌కి ఇచ్చే స్థితిలో ఉన్నారని ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ కోసం యాదయ్య, శ్రీకాంతాచారి వంటి వీరులు ఆత్మబలిదానాలు చేసుకున్నప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు సంకల్లో ఉన్నారు.
రేవంత్ రెడ్డి ఫ్యూడల్, భూస్వామ్య మనస్తత్వం బయటపడింది. సీఎం కుర్చీకి గౌరవం చెప్పమని చెప్పే ఆయన, మంత్రులు, వైస్ ఛాన్సలర్ల పట్ల మాత్రం గౌరవం చూపడం లేదు. నేను కుమార్ ను వైస్ ఛాన్సలర్ ను చేశామని రేవంత్ రెడ్డి అన్నారు. ఓయూ వైస్ ఛాన్సలర్ కుమార్ స్కాలర్. క్యాబినెట్ మంత్రిని రేవంత్ రెడ్డి పేరు పెట్టి పిలిచారు.
నిరుద్యోగులను మోసం చేస్తూ, గుర్తించిన ఉద్యోగాలను సృష్టించిన ఉద్యోగాలుగా చూపుతున్నారు. యువతను మభ్యపెడుతున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీకి వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చే సత్తా లేకుండా కాళేశ్వరం, జీ.ఓ 29 వంటి అంశాలపై తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారు. కోర్టులు, తీర్పులను అవమానిస్తూ వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి అవమానం.
కోదండరామ్ ని నిజంగా గౌరవిస్తే ఇప్పటికిప్పుడు ఎమ్మెల్సీగా చేసి చూపించాలి. లేకపోతే ఆయనపై మొసలి కన్నీళ్లే కారుస్తున్నారని తేలిపోతుంది. మేము రియల్ ఎస్టేట్ దందాలకు రాజకీయాల్లోకి రాలేదు.
రేవంత్ రెడ్డిని సీఎం చేసేందుకు నిరుద్యోగులు బస్సులు వేసుకుని రాష్ట్రం మొత్తం తిరిగారు. 60 వేల ఉద్యోగాలు రేవంత్ రెడ్డి గుర్తించిన ఉద్యోగాలా…? సృష్టించిన ఉద్యోగాలా? రేవంత్ రెడ్డి చంపింది ఏనుగులు, సింహాలను కాదు. జింకలు, నెమళ్లను చంపారు. ప్రజల కోసం, తెలంగాణ కోసం కష్టపడి, త్యాగం చేశాం. ఆ త్యాగానికి విలువ లేకుండా మమ్మల్ని అడ్డుకోవడం అన్యాయం. బిఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందనే భయంతోనే రేవంత్ రెడ్డి అబద్ధాలు, మభ్యపెట్టే మాటలు మాట్లాడుతున్నారు. ప్రజలు ఈ నిజాలు గమనిస్తున్నారు.
ఉస్మానియా భూములను బిఆర్ఎస్ ప్లాట్లు చేసుకుని అమ్ముకుంటారని రేవంత్ రెడ్డి అంటున్నారు. గచ్చిబౌలి భూములను ప్లాట్లు చేసి అమ్ముకున్నది ఎవరు ప్రజలు చెప్పాలి. కోదండరాం అంటే నాకు అంటే రేవంత్ రెడ్డికి ఎక్కువ ప్రేమ? కోదండరాం పట్ల రేవంత్ రెడ్డి మొసలి కన్నీరు కారుస్తున్నారు. రేవంత్ రెడ్డిని హీరోగా పెట్టి ఆహా నా పెళ్ళంట సినిమా తీయాలి.
ఓయూకు వెయ్యి కోట్లు ఇవ్వు రేవంత్ రెడ్డి. కోదండరామ్ సీఎం పదవికి రేవంత్ రెడ్డి కంటే అర్హుడు. రేవంత్ రెడ్డి సీఎం పదవి నుంచి దిగిపోయి కోదండరామ్ కు సీఎం పదవి అప్పగించాలి. ఎరుకుల బిడ్డ కుర్రా సత్యనారాయణ కు ఎమ్మెల్సీ ఇస్తే అడ్డుకున్నారు. మేము కోదండరామ్ ను అడ్డుకోలేదు.
మా గొంతుకోయడం కోసం కోదండరామ్ ను రేవంత్ రెడ్డి అడ్డుపెట్టారు. కోదండరామ్ తో రేపు పొద్దున మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కోదండరామ్ ను నిలబెట్టు. కోదండరామ్ ను లిటిగేషన్ లో ఎందుకు పెట్టారు? దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ కు ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడే కోదండరామ్ సీఎంకు ఎందుకు గుర్తుకు వచ్చారు?
బీజేపీ కుట్రపూరితంగా మమ్మల్ని ఎమ్మెల్సీలుగా కాకుండా చేస్తే,మాట్లాడాల్సింది కోదండరామ్ కాదా? మేము కోర్టులో కేసు వేసినప్పుడు కోదండరామ్ లేరు. కోర్టులో తీర్పు వచ్చేవరకు ఎమ్మెల్సీలుగా ఎవరిని నామినేట్ చేయమని కోర్టుకు చెప్పారు. కోర్టు చెప్పేవరకు ఎవరిని ఎమ్మెల్సీలుగా తీసుకోమని
గవర్నర్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ ఇద్దరిని నామినేట్ చేయగానే గవర్నర్ ఆమోదించారు.
మా స్థాయికి హైకోర్టుకు వెళ్లడమే కష్టం. కోదండరామ్ ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు కదా? గవర్నర్ ఎట్లా అంగీకరిస్తారు? మేము సుప్రీంకోర్టుకు వెళ్తే మా తప్పు ఎట్లా అవుతుంది? కోదండరామ్ ను ఎమ్మెల్సీ 15 రోజుల్లో కాదు. ఇప్పటికిప్పుడు ఎమ్మెల్సీని చెయ్యి. వచ్చే సారి ఓయూ పర్యటనలో ఒక్క పోలీసు ఉండవద్దని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఈ రోజు పర్యటనలో రేవంత్ రెడ్డి చుట్టూ పోలీసులు ఉన్నట్లే కదా?