– బిడ్డను ఎంపీ చేయడం కోసం కడియం శ్రీహరి పార్టీ మారారు
– శ్రీహరి అంటే చచ్చిన పాముతో సమానం
– మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య
హైదరాబాద్: ఫిరాయింపుల్లో ముందు వరుసలో ఉన్న కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నానో చెప్పలేని పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీలో చేరానని స్వయంగా కడియం శ్రీహరి చెప్పారు.అభివృద్ధి కోసమే పార్టీ మారారని కడియం శ్రీహరి అంటున్నారు. కడియం శ్రీహరి అప్రూవర్ గా మారారు
కడియం శ్రీహరికి అభివృద్ధి ఇప్పుడు గుర్తుకు వచ్చిందా? 15 ఏళ్ళు మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు అభివృద్ధి గుర్తుకు రాలేదా? తన బిడ్డను ఎంపీ చేయడం కోసం కడియం శ్రీహరి పార్టీ మారారు. కడియం శ్రీహరి తన రాజకీయ సమాధిని తానే కట్టుకున్నారు. కడియం శ్రీహరి ఇళ్ళు మీద ఇల్లు కట్టుకున్నారు. విదేశాల్లో ఆస్తులు సంపాదించుకున్నారు. హైడల్ ప్రాజెక్టులు అమ్ముకున్నారు.
విద్యాశాఖ మంత్రిగా పోస్టులు అమ్ముకున్నారు. కడియం శ్రీహరి అభివృద్ధి కావడం తప్ప, స్టేషన్ ఘన్ పూర్ ను అభివృద్ధి చేయలేదు.
జస్టిస్ బి.ఆర్.గవాయ్ మూడు నెలల గడువు ఇచ్చి స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని డైరెక్షన్ ఇచ్చారు. స్పీకర్ రాజ్యాంగాన్ని పరిరక్షించాలి. అంబేద్కర్ పైన గౌరవం ఉంటే స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలి. రేవంత్ రెడ్డి చెప్పినట్లు వింటే స్పీకర్ కోర్టు ధిక్కరణ కిందకు వస్తారు. కడియం శ్రీహరి అంటే అవినీతి తిమింగలం. కాంట్రాక్టర్ల నుంచి పెద్దఎత్తున వసూళ్లకు పాల్పడ్డారు.
బినామీ పేర్లతో కడియం శ్రీహరికి ఆస్తులు ఉన్నాయి. కడియం శ్రీహరి అంటే చచ్చిన పాముతో సమానం. కడియం శ్రీహరి వెంటనే రాజీనామా చేయాలి. స్టేషన్ ఘన్ పూర్ కు 800 కోట్లు తెచ్చానని కడియం శ్రీహరి అంటున్నారు. కడియం శ్రీహరికి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం. నాకు టిక్కెట్ ఇవ్వకపోతే పార్టీ మారతానని కడియం శ్రీహరి కేసీఆర్ ను బ్లాక్ మెయిల్ చేశారు.