గిన్నిస్ బుక్ పుట్టినరోజు
ఓరి..ఈన్ని గిన్నిస్ బుక్కులో
ఎక్కించాలిరా..
పల్లెటూరిలో కూడా
ఏదైనా ఘనతకు..
అదెలాంటిదైనా దాని పర్యాయపదం గిన్నిస్..
విజయాలు..విచిత్రాలు..
వైపరీత్యాలు..
అన్నిటికీ వేదిక…
ఘనకార్యాల సంచిక..!
ప్రపంచంలో
అన్నిటికంటే వేగంగా
ఎగిరే పక్షి ఏదిరా..
హగ్ బీవర్ మనసులో పుట్టిన ఒక ప్రశ్న నుంచి మొదలైన ఆలోచన..
ప్రతి రికార్డును ఒక చోట చేర్చాలన్న యోచన..
అదే..అదే..
గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్..
తొలి ప్రతి..
ఇదే రోజున..
అరవై ఎనిమిదేళ్ల క్రితం..
అప్పటి నుంచి అప్రతిహతం!
24 భాషల్లో
హిట్ ఎంటర్టైన్మెంట్
ప్రచురించిన పుస్తకం
రికార్డుల వెల్లువ…
కట్టలేని విలువ..
ఆ తర్వాత మ్యూజియంగా కూడా అవతరించి
ఎన్నో సేకరించి..
ఎన్నెన్నో వివరించి
తానుగా సృష్టించుకుంది
ఓ రికార్డు…!
అత్యధిక పాటలు
పాడిన మన
గానకోకిల లతాజీ..
గాన గంధర్వుడు ఎస్పీబీ..
జ్ఞాపకశక్తికి రాజన్ మహదేవన్..
ఇరవై అయిదు
అంగుళాల
చేతి వేలి గోళ్ళ
శ్రీధర్ చిల్లాన్..
బుల్లి దర్శకుడు కిషన్..
ఒకే రోజున 833 కంటి ఆపరేషన్లు చేసిన
మురుగప్ప చిన్నవీరప్ప..
అత్యధిక సినిమాల మనోరమ..
మన గిన్నిస్ వీరుల పేనోరమ!
అక్కడితో ఆగలేదు..
దర్శకరత్న దాసరి..
మహిళా దర్శకురాలు
విజయనిర్మల..
నిర్మాత రామానాయుడు..
1050 సినిమాల బ్రహ్మానందం..
172 రోజుల్లో
ఏడు ఖండాల్లో
అత్యున్నత శిఖరాలు
అధిరోహించిన
మల్లి మస్తాన్ బాబు..
ఇలా మన తెలుగు వీరులు..
గిన్నీసులో వెతికారు దారులు!
తిరుమలలో శ్రీవారికి సమర్పించిన
శిరోజాలూ
అక్కడ నమోదు..
అశేషాజనాల విశేష కుంభమేళా..
ఎక్కువగా సినిమాలు
చూసే జనం…
అత్యధిక థియేటర్లు..
సినిమాల నిర్మాణం..
రామోజీ ఫిలిం సిటీ..
ఇన్ని దాచుకున్న వానిటీ..
గిన్నిస్ బుక్..
ఎప్పటికప్పుడు నవ్యంగా..
అన్నీ సవ్యంగా..!
– ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286
7995666286