పరవాడ: అనకాపల్లి జిల్లా, పరవాడలో రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ శైలజ రాయపాటి గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ కాలేజీలో కీచక లెక్చరర్ చేతిలో లైంగిక దాడికి గురైన బాలికను పరామర్శించారు. బాధితరాలిని పరామర్శించే సమయంలోనే మరో ఇద్దరు విద్యార్థినులు లెక్చరర్ వేధింపుల ప్రవర్తనపై శైలజకు ఫిర్యాదు చేశారు. అతనికి అత్యంత కఠిన శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని ఛైర్ పర్సన్ ని వారు కోరారు. అయితే ఇప్పటికే ఆ లెక్చరర్ పై పోక్సో కేసును నమోదు చేశారని శైలజ తెలిపారు. ఇటువంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. బాలికలు సైతం అప్రమత్తంగా ఉండాలి. ఎటువంటి సమస్య వచ్చినా మహిళా కమిషన్ అండగా ఉంటుందన్న శైలజ భరోసా కల్పించారు.