– కస్టమ్స్ జాయింట్ కమిషనర్ శ్రీధర్
విజయవాడ: అనితర సాధ్యమైన పనితీరుతో, అమూల్యమైన సేవలతో అబ్దుల్ అజీమ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ లో సుస్థిరమైన స్థానాన్ని పొందారని కస్టమ్స్ జాయింట్ కమిషనర్ శ్రీధర్ తానాజీ దూమల్ ప్రశంసించారు.
శుక్రవారం ఆటోనగర్ లోని కస్టమ్స్ ప్రధాన కార్యాలయంలో జరిగిన అసిస్టెంట్ కమిషనర్ అబ్దుల్ అజీమ్ ఉద్యోగ విరమణ సభలో ఆయన ప్రసంగించారు. విధి నిర్వహణలో గొప్ప పనితీరును కనబరచిన అజీమ్, శాఖ పరంగా ఎన్నో అవార్డులు, రివార్డులు పొంది కస్టమ్స్, జి.ఎస్.టి శాఖలకు గర్వకారణం గా నిలిచారని శ్రీధర్ కొనియాడారు. అంకిత భావంతో పనిచేసిన అజీమ్ సేవలు, ఉద్యోగులందరికి ఆదర్శమని ఆయన తెలిపారు. జిఎస్టి
అసిస్టెంట్ కమిషనర్ ఎం. నాగరాజు మాట్లాడుతూ.. కృషి, పట్టుదలే సోపానాలుగా అంచలంచెలుగా ఎదిగిన ఆదర్శ అధికారి అజీమ్ అన్నారు. రిటైర్డ్ అధికారి అజీమ్ మాట్లాడుతూ..సత్ఫలితాలు పొందాలనే ఆకాంక్ష, అందరి సహకారం తనను ఈ స్థానంలో నిలిపాయన్నారు.
అనంతరం అజీమ్ ను పెద్ద ఎత్తున ఉద్యోగులు సన్మానించి, జ్ఞాపికలు అందచేశారు. కార్యక్రమంలో కస్టమ్స్, జిఎస్టి అధికారులు వి.ఎస్.కె.రాయలు, మధుబాబు, రవికుమార్, గద్దె తిలక్, శ్రీనివాస్ చౌదరి, టి.వివేకానంద, గుమ్మడి సీతారామయ్యచౌదరి, పి.వి. సత్యనారాయణ, పి. కోటేశ్వరరావు, ఎన్.ఎస్.నగేష్ బాబు, పర్వతనేని ప్రసాద్, కె.ఎన్.శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.