– ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్
హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను తన పార్టీ లోకి ఆహ్వానిస్తున్నట్లు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. తమ పార్టీలో చేరితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని ఆయన స్పష్టం చేశారు. తన పార్టీలో చేరి బీజేపీ వదిలిన బాణం కాదని కవిత నిరూపించు కోవాలన్నారు. ప్రజల్లో కవితపై ఆత్మ విశ్వాసం పెరగాలంటే గద్దర్ చేరిన ప్రజా శాంతి పార్టీలో చేరాలని కోరారు.