– 10న ‘సూపర్ సిక్స్ – సూపర్ హిట్’
– మంత్రి అనగాని వెల్లడి
అనంతపురం: ఇక్కడ సూపర్ సిక్స్ – సూపర్ హిట్ కార్యక్రమాన్ని ఈ నెల పదోతేదీన నిర్వహించనున్నామని, ప్రజలంతా విజయవంతం చేయాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ కోరారు. ఈ మేరకు ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. 15నెలల్లో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రజలు లబ్ధిపొందుతున్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి అద్భుతమైన స్పందన వచ్చింది. మహిళలకు ఉచిత బస్సు పథకం విజయవంతంగా అమలవుతోంది. అనంతపురం ఎప్పుడూ టీడీపీకి, కూటమి ప్రభుత్వానికి అండగా ఉంది. జిల్లాలోని 14 నియోజకవర్గాలు, రెండు ఎంపీ స్థానాలు కూటమి గెలుచుకుంది. సీఎం చంద్రబాబు కృషితో గతంలో కియా మోటార్స్ ను ఏర్పాటైంది. భవిష్యత్తులో అనంతపురానికి మరిన్ని ఇండస్ట్రీలు రాబోతున్నాయి.
రాయలసీమ ప్రాంతాన్ని సశ్యశ్యామలం చేసేందుకు కృషి చేస్తున్నాం. మహానాడు కార్యక్రమానికి అద్భుతమైన స్పందన లభించింది. ఐదు లక్షల మంది విశాఖ వచ్చి యోగాంధ్రలో పాల్గొన్నారు. ఇది ప్రభుత్వంపై ప్రజలకున్న విశ్వాసానికి నిదర్శనం. అనంతపురంలో మూడున్నర లక్షల మంది హాజరయ్యేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మంత్రులు, కమిటీ బృందం అన్ని కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంది. ప్రతిపక్ష నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. పాజిటివ్ ఆలోచనతో బీమా పధకాన్ని తీసుకొచ్చాం.