ధనుంజయ్ రెడ్డి,కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు ఏసీబీ కోర్టు రెగ్యులర్ బెయిల్
– ఉప రాష్ట్రపతి ఎన్నిక ఓటింగ్ కోసం మిథున్‌కు మధ్యంతర బెయిల్
విజయవాడ: లిక్కర్ స్కామ్ కేసులో కేసులో ఏ31గా ఉన్న ధనుంజయ్ రెడ్డి, ఏ32గా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి, ఏ33గా ఉన్న బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఒక్కొక్కరు రూ. లక్ష చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. దీంతో పాటు, ముగ్గురి పాస్‌పోర్టులను కోర్టుకు అప్పగించాలని షరతు విధించింది.
ఇదే కేసులో రిమాండ్‌లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 11వ తేదీన తిరిగి అధికారుల ఎదుట లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.