అమరావతి: సీఎంతో సహా మంత్రులు సినిమాల్లో నటించడంపై ఎలాంటి నిషేధం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. మాజీ సీఎం, సినీ నటుడు ఎన్టీఆర్ విషయంలోనే అప్పట్లో హైకోర్టు తీర్పునిచ్చిందని గుర్తు చేసింది. ‘హరి హర వీరమల్లు’ సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ పిటిషన్ వేయగా జస్టిస్ వెంకట జ్యోతి ఈ విధంగా తీర్పు వెలువరించారు.