– ప్రవీణ్ కుమార్ విమర్శ
కాగజ్ నగర్: తెలంగాణ రైజింగ్ కాదు, తెలంగాణ ఫాలింగ్… సీతక్కకో న్యాయం, సిర్పూరుకు ఇంకో న్యాయమా? అని ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ మేరకు ఆయన మరణించిన ఆదివాసి మహిళ శ్రీదేవి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కలెక్టర్,ఐ టిడిఎ పిఓ కనీసం కుటుంబాన్ని పరామర్శించకపోవడం దారుణం. ముఖ్యమంత్రి తెలంగాణ రైజింగ్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు కానీ, తెలంగాణ రైజింగ్ కాదు, తెలంగాణ ఫాలింగ్. 4 వేల కోట్లతో ఫోర్త్ సిటీకి ఆరు లైన్ల రోడ్డు కోసం, ఆంధ్ర ప్రాంత బిజెపి ఎంపి సిఎం రమేష్ కి కాంట్రాక్ట్ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం. సిర్పూర్ నియోజకవర్గ ఆదివాసి ప్రాంతాలకు కనీసం రెండు ఖర్చు పెట్టి రోడ్లు వేయడం లేదంటూ మండిపడ్డారు. ఇటీవల సిర్పూర్ నియోజకవర్గంలోని చిన్న మాలిని గ్రామానికి చెందిన కొర్రం శ్రీదేవి అనే గర్భిణి మహిళ రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల అధిక రక్త స్రావం జరిగి బాబుకు జన్మనిచ్చిన అనంతరం మరణించిందని తెలిపారు. స్వేరోస్ ఫౌండేషన్ నుండి ఆ పుట్టిన బిడ్డ పేరు మీద చదివుకున్నంత కాలం నెలకు 2500 రూ అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ బిడ్డ తల్లి మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. రోడ్డు సౌకర్యం ఉంటే, అంబులెన్స్ వస్తే ఆ మహిళ చనిపోయేది కాదన్నారు. పాడైపోయిన రోడ్డును ఆయన పరిశీలించారు. సిర్పూర్ రాష్ట్రంలో మొట్టమొదటి నియోజకవర్గం, చిన్న మాలిని రాష్ట్రంలోనే మొదటి ఓటరు ఉండే గ్రామం కానీ… అక్కడికే రోడ్డు సౌకర్యం లేకపోవడం అత్యంత దయనీయమన్నారు.
అవసరం లేకపోయినా ఫోర్త్ సిటీకి రోడ్లు వేసే ప్రభుత్వం,ఆదివాసుల ప్రాణాలను కాపాడడానికి రోడ్లు వేయదా అంటూ అడిగారు. అటవీ అధికారులు అనుమతి అంటూ సాకులు చెప్పే ప్రభుత్వం ములుగు నియోజకవర్గంలోని అటవీ ప్రాంతంలో రోడ్డు వేయడానికి ఎలా అనుమతులు వస్తున్నాయని ప్రశ్నించారు.
ఈ ప్రాంత ప్రజలకు బిజెపి, కాంగ్రెస్ పార్టీలతో న్యాయం జరగదని, కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వంలోని అభివృద్ధి జరుగుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ కేసిఆర్ ముఖ్యమంత్రి అవుతారని, ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే రోడ్డు, వైద్యం, విద్య వంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చిన్నమాలిని గ్రామస్థులు బీఆర్ఎస్ కండువా కప్పుకొని పార్టీలో చేరారు.