– తెలుగు మరియు సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్. డి. విల్సన్
అమరావతి: భారత జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీఏ) ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన రాధాకృష్ణన్ కు బాజాపా నేత తెలుగు మరియు సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్. డి. విల్సన్ అభినందనలు తెలియ చేశారు.
పార్లమెంట్ సభ్యుడిగా, గవర్నర్లగా వ్యవహరించి ప్రత్యేక గుర్తింపు పొందిన రాధాకృష్ణన్ ఉప రాష్ట్ర పదవికే వన్నె తెస్తారన్న ఆశా భావాన్ని వ్యక్తం చేశారు. అభ్యుదయ భావాలు కలిగిన రాధాకృష్ణన్ సేవలు ఇకపై దేశానికీ ఉపయోగపడనున్నాయని చెప్పారు.
నిరంతరం ప్రజా సేవకు అంకితమైన రాధాకృష్ణన్ రాజ్యసభ సమావేశాల్ని సమర్ధవంతంగా నిర్వహించి అందని మన్ననలు తప్పకుండా పొందుతారన్నా విశ్వాసాన్ని మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో వ్యక్తం చేశారు