– రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత
అనంతపురం: జిల్లాలో ఇంత పెద్ద సభ జరగడం నిజంగా మనందరి అదృష్టం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం 15 నెలల్లోనే సూపర్ సిక్స్‌లోని పథకాలను అమలు చేసి, సూపర్ హిట్ కార్యక్రమాన్ని ప్రజల మధ్య విజయవంతంగా జరుపుకోవడం చంద్రబాబు నాయుడుగారి కృషి వల్లే సాధ్యమైంది. లక్షలాది మంది నాయకులు, కార్యకర్తల మధ్య జరగడం సంతోషకరమే కాకుండా, ఉమ్మడి అనంతపురం జిల్లాలో మహిళలు కూడా మేము సైతం అంటూ ముందుకు రావడం ఈ సభకు ప్రత్యేక ఆకర్షణ. ఇది మహిళల విశ్వాసాన్ని, కూటమి పట్ల ఉన్న మమకారాన్ని చాటుతోంది.
సూపర్ సిక్స్‌లో భాగంగా తల్లికి వందనం పథకం – కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి లబ్ధి చేకూర్చిన ఘనత లోకేష్ బాబుకి దక్కింది. అదేవిధంగా దీపం-2 ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ చేసి, మహిళలకు వంటలో ఇబ్బందులు లేకుండా చూసిన నాయకుడు మన అన్న చంద్రన్నే. సంవత్సరానికి ఉచితంగా 3 సిలిండర్లు ఇచ్చి ప్రతి ఇంటికి ఉపశమనం కల్పించారు. రైతుల విషయానికి వస్తే – వైసీపీ ప్రభుత్వంలో సైకో సీఎం కారణంగా ఐదేళ్లు రైతన్నలు నరకం చూశారు. ఎరువుల కొరత, పంట బీమా లేని స్థితి, ఇన్పుట్ సబ్సిడీ లోటు – అన్నింటికీ రైతు దెబ్బతిన్నాడు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకుని “అన్నదాత సుఖీభవ” పథకం ద్వారా ప్రతి రైతుకు రూ.20,000 అందిస్తామని ప్రకటించారు.
ఆ హామీని నిలబెట్టి, ఆగస్టు 2వ తేదీన తొలి విడతగా రూ.7,000 రైతుల ఖాతాల్లో జమ చేశారు. వైసీపీ హయాంలో మహిళల పథకాలు కొన్ని జిల్లాలకు పరిమితమయ్యాయి. కానీ మన చంద్రన్న వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మహిళా స్వేచ్ఛగా, సౌకర్యంగా ప్రయాణించేలా ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు. ఇది ప్రతి ఆడబిడ్డకు రక్షణ, గౌరవం ఇచ్చే సంకేతం. రాయలసీమ అంటే ఒకప్పుడు రాళ్లసీమ అని పేరొందింది. కానీ నేడు చంద్రబాబు నాయకత్వంలో, పవన్ కళ్యాణ్, లోకేష్ కృషితో రత్నాల సీమగా మారింది. పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమలు నెలకొంటున్నాయి, యువతకు ఉద్యోగాలు వస్తున్నాయి.
రాష్ట్ర ప్రజలకు నిజమైన ఊరట
– బీజేపీ అనంతపురం అధ్యక్షుడు కొనకళ్ల రాజేష్
సూపర్ సిక్స్ పథకాలతో రాష్ట్ర ప్రజలకు నిజమైన ఊరట వచ్చింది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం మళ్లీ అభివృద్ధి మార్గంలో అడుగేస్తోంది. రైతులు, మహిళలు, యువత, వృద్ధులు అందరూ లబ్ధిపొందే విధంగా సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి. వైసీపీ పాలనలో అవినీతి, అక్రమాలు, అణచివేత తప్ప ప్రజలకు ఉపయోగం లేదు. టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి కలిసొచ్చాక రాష్ట్రంలో కొత్త ఆశ వెలిగింది.
విద్య, వైద్య, ఉపాధి రంగాల్లో సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు దిక్సూచి అవుతాయి. “ప్రజలు నమ్మి ఇచ్చిన అవకాశం వృధా చేయం, అభివృద్ధి – సంక్షేమం రెండింటినీ కలిపి అందిస్తాం” అని హామీ ఇచ్చారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్తున్న కూటమి పాలన…
– మంత్రి సత్యకుమార్ యాదవ్
గత ఏడాది కూటమి నాయకత్వం ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రజల మధ్యకు వచ్చి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని స్థాపించారు. కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పటైతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పధం దిశగా తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. ఈ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తామని హామీ ఇచ్చారు. చెప్పిన విధంగానే రాష్ట్రంలో ఓ చక్కటి వాతావరణాన్ని తీసుకువచ్చింది కూటమి ప్రభుత్వం. 65 లక్షల మందికి సామాజిక పింఛన్లు, 68 లక్షల మందికి తల్లికి వందనం, కోటి మందికి అక్కచెల్లెమ్మలకు దీపం-2 పథకం వర్తింపు, 2 కోట్ల మందికి పైగా ఉచిత బస్సు ప్రయాణం కూటమి ప్రభుత్వం కల్పించింది.
ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతూ పొలవరాన్ని పూర్తి చేస్తూ.. రాజధానిని నిర్మిస్తూ.. అనేక ప్రాంతాల్లో రోడ్లను, ఎక్స్ ప్రెస్ వేలను, పోర్టులను నిర్మిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్తు.. అదేవిధంగా సంక్షేమాన్ని కూడా పరుగులు పెట్టుస్తుంది కూటమి ప్రభుత్వం. సంక్షేమం – అభివృద్ధి సమాంతరంగా ముందుకు తీసుకువెళ్తు.. లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకురావడమే కాకుండా.. లక్షల కోట్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పించి.. ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు సాధికారికతను కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుంది.
ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి యూనివర్సల్ హెల్త్ పాలసీని తీసుకువచ్చి.. ప్రజల ఆరోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. అదేవిధంగా రాష్ట్రంలోని వైద్య విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్యను అందించేందుకు మెడికల్ కళాశాలను నాణ్యమైన ప్రమాణాలతో పూర్తి చేసే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గత ఐదేళ్ల కాలంలో పరదాల చాటున, బ్యారికేడ్లు మాటున తిరిగిన నాయకత్వం నేడు నింగి – నీరు – నెల- నిప్పు, ధూళి పంచభూతలను సైతం లూటీ చేశారు. ఇటువంటి వారు ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారాలు చేస్తూ.. ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తుంది