– 10 సీట్లతో ప్రవేశాలకు అనుమతించిన ప్రభుత్వం
– క్యాన్సర్ విజృంభణ దృష్ట్యా ఏపీలో 3 క్యాన్సర్ సూపర్ స్పెషాలిటీ కోర్సులను అనుమతి
– వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమారి యాదవ్ వెల్లడి
విశాఖపట్నం: ఇక్కడి ప్రఖ్యాత హోమి భాభా క్యాన్సర్ హాస్పిటల్, పరిశోధనా కేంద్రంలో 3 ఎంసిహెచ్ కోర్సులను ప్రారంభించడానికి వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఎంసిహెచ్ సర్జికల్ ఆంకాలజిలో ప్రతి ఏడాది 2 సీట్లకు, ఎంసిహెచ్ గైనకలాజికల్ ఆంకాలజీ లో 4 సీట్లకు, డిఎమ్ మెడికల్ ఆంకాలజిలో 4 సీట్లకు ప్రవేశాలు జరుగుతాయి. ఈ మూడు విభాగాల్లో రాష్ట్రంలో ప్రస్తుతం 13 ఎంసిహెచ్ సీట్లు మాత్రమే ఉన్నాయి.
120 పడకల తో కూడిన హోమి భాభా క్యాన్సర్ హాస్పిటల్, పరిశోధనా కేంద్రం భారత ప్రభుత్వం వారి పూర్తి గ్రాంటుతో అణుశక్తి విభాగం పర్యవేక్షణలో నడుస్తున్న సంస్థ. మొత్తం 10 సీట్ల తో 3 క్యాన్సర్ స్పెషాల్టీ కోర్సులను ప్రారంభించడానికి ముందుకు వచ్చిన ఈ సంస్థను మంత్రి అభినందించారు.