– కలిసి సర్కారుతో పోరాడుదాం
– విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకండి
– సర్కారు 20 నెలల్లో తెచ్చిన రెండున్నర లక్షలకోట్లు ఏమైనయ్.?
– రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీష్ రెడ్డి
హైదరాబాద్ : ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించకుండా విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, కాలేజీ యాజమాన్యాలను రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోంది. ఫలితంగా మేనేజ్ మెంట్లు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయి. వడ్డీ వ్యాపారుల మాదిరిగా వ్యవహరిస్తూ..డబ్బులు కడితేనే సర్టిఫికెట్ ఇస్తామని వేధిస్తున్నాయి.
దీంతో మరో మార్గం లేక చాలామంది విద్యార్థులు అప్పులు చేసి సర్టిఫికేట్లు తీసుకుంటున్నారు. యాజమాన్యాలు వ్యవహరిస్తున్న ఈ విధానం సరికాదు. సర్కారు రీయింబర్స్ మెంట్ ఇస్తే.. మళ్లీ విద్యార్థులకు డబ్బులు తిరిగి ఇస్తారా.?
విద్యార్థులు ఎవరు కూడా డబ్బులు కట్టకండి. మనమంతా కలిసి సర్కారుపై పోరాటం చేద్దాం. యాజమాన్యాలతో కలిసి సర్కారుపై పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు ఇస్తుంది. రీయింబర్స్ మెంట్ ఇచ్చే వరకు సర్కారుపై పోరాటం చేద్దాం. కానీ విద్యార్థుల జీవితాలతో మాత్రం యాజమాన్యాలు ఆటలు ఆడొద్దు.
రాష్ట్రంలో దాదాపు రూ.13 వేల కోట్ల రూపాయల ఫీరీయింబర్స్ మెంట్ బకాయిలు ఉన్నాయి. 13 లక్షల మంది విద్యార్థుల చదువు పూర్తైనా.. రీయింబర్స్ మెంట్ రాక.. సర్టిఫికేట్లు అందక ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగాలు వచ్చినా, ఉన్నత విద్యాసంస్థల్లో సీట్లు వచ్చినా సర్టిఫికేట్లు లేకపోవడంతో వెళ్లలేకపోతున్నారు. దీనివల్ల 13 లక్షల కుటుంబాలు తీవ్ర ఆవేదనలో ఉన్నాయి.
డిగ్రీ, పీజీ, ఫార్మాసీ, ఇంజినీరింగ్ విద్యార్థులకు ఫీ రీయింబర్స్ మెంట్ చెల్లించలేదు. ఒక్కో కాలేజీలో 200 నుండి 500 మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ ట్ రావాల్సి ఉంది. 20 నెలల్లో రెండున్నర లక్షల కోట్ల అప్పు చేసిన సర్కారు కేవలం రూ.10 వేలకోట్ల రూపాయల ఫీజు బకాయిలు మాత్రం చెల్లించడం లేదు.
అంటే విద్యార్థులపై సర్కారుకు ఉన్న ప్రేమ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.
వందల కోట్లు పెట్టి హైదరాబాద్ లో ఆర్టిఫిషియల్ బీచ్ లు కట్టడానికి.. అందాల పోటీలు నిర్వహించడానికి.. అందాల భామలకు ఒక్కో ప్లేటుకు లక్ష రూపాయల ఖర్చుతో భోజనం పెట్టడానికి డబ్బులు ఉంటాయి కానీ.. ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించడానికి ఉండవా..? పిల్లల చదువుల కోసం రూ.9వేల కోట్లు లేవుగానీ.. లక్షన్నర కోట్లతో మూసీ ప్రక్షాళన చేస్తానని రేవంత్ రెడ్డి పొంకనాలు కొడుతున్నారు.
ఫీజులు బకాయి ఉండటంతో కాలేజీలు సర్టిఫికేట్లు ఇవ్వక.. ఐఐటీ ఖరగ్ పూర్, ఎన్ఐటీ లాంటి ప్రఖ్యాత విద్యా సంస్థల్లో సీట్లు వచ్చినా విద్యార్థులు చేరలేని పరిస్థితి ఏర్పడింది. సర్కారు తీరుతో వారు సీట్లు కోల్పోయారు. జేఎన్టీయూ క్యాంపస్ లో రూ.20 వేలు పెండింగ్ ఉందని ఒక విద్యార్థిని సర్టిఫికేట్లు ఇవ్వకపోవడం దారుణం.
ఇలా చాలా జేఎన్టీయూ కాలేజీల్లో కూడా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
ఒక అమ్మాయి అయితే ఫార్మసీ పూర్తి చేశాక.. మూడు ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. కానీ సర్టిఫికేట్లు చేతిలో లేకపోవడం వల్ల చేరలేకపోయింది. ఇలా లక్షలాది మంది విద్యార్థులు కన్నీరు పెడుతున్నారు. సర్కారు వైఖరితో వారి జీవితాలు నాశనం అవుతున్నాయి.
బీటెక్, ఫార్మసీ, పీజీ పూర్తి చేసి తల్లిదండ్రులకు ఆసరాగా ఉందామని పిల్లలు అనుకుంటున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం రీయింబర్స్ మెంట్ చెల్లించకపోవడం వల్ల వారు ఖాళీగా ఉండాల్సి వస్తోంది. ఓ వైపు ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వదు.. మరోవైపు ప్రయివేటులో ఉద్యోగాలు తెచ్చుకుని జాయిన్ అవుదామంటే ఇలా సర్టిఫికేట్లు చేతికి రాకుండా అడ్డుకుంటోంది.
యువత ఆశలను రేవంత్ రెడ్డి సర్కారు నిర్వీర్యం చేస్తోంది. తెలంగాణ యువతను రోడ్డున పడేస్తోంది. సాధారంగా పేద కుంటుంబాల వాళ్లే ఫీరియింబర్స్ మెంట్ ను వాడుకుంటారు. ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో.. తన దగ్గర ఏం లేవు.. కేవలం విద్య మాత్రమే ఉంది.
మంచి విద్య అందించి పేద బిడ్డలను ప్రయోజకులను చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ వాస్తవమేమో ఇలా ఉంది. ఫీజులు కట్టకుండా సర్టిఫికేట్లు రాకుండా అడ్డుకుంటున్నారు. రేవంత్ రెడ్డి దీని ప్రతి ఫలం కూడా అనుభవించక తప్పదు. యువతతో పెట్టుకున్న నేపాల్ లో ఏం జరిగిందో చూస్తున్నాం. తెలంగాణలో కూడా అలాంటి పరిస్థితులు ఖచ్చితంగా వస్తాయి. ఓ వైపు గ్రూప్ 1 అభ్యర్థుల జీవితాలతో ఆడుకుంటున్నాడు. మరోవైపు కాలేజీల్లో చదువుకుంటున్న వారి జీవితాలతో ఆడుకుంటున్నాడు. వారు రోడ్డుపైకి వచ్చిన రోజు నేపాల్ లో ప్రధాని, మంత్రులు పారిపోయినట్టే.. మన ముఖ్యమంత్రి, మంత్రులు పారిపోవాల్సి వస్తుంది.