సత్తెనపల్లి: రాజుపాలెం ఎంపీడీవో కార్యాలయం వద్ద స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం సోమవారం జరిగింది. ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొని, లబ్ధిదారులకు కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
రేషన్ సరఫరాలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు, ప్రజలకు మరింత సౌకర్యవంతంగా రేషన్ సరుకులు అందించేందుకు వీలుగా ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. పాత బియ్యం కార్డుల స్థానంలో ఈ స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేస్తోందని, పాతవారితో పాటుగా కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామన్నారు.