– జెండాలో ఒకవైపు వరి కంకులు, మరోవైపు కార్మికుల గుర్తు
– పార్టీ జెండా ఆవిష్కరణ అనంతరం రాష్ట్ర కమిటీని ప్రకటించిన తీన్మార్ మల్లన్న
హైదరాబాద్: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. తన పార్టీకి ‘తెలంగాణ రాజ్యాధికార పార్టీ’ (టీఆర్పీ) అని పేరు పెట్టినట్లు ప్రకటించారు. తాజ్ కృష్ణ హోటల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్త రాజకీయ పార్టీ పేరును ప్రకటించారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17వ తేదీ బీసీల తల రాత మారే దినంగా తాను భావిస్తున్నానన్నారు. తెలంగాణలో మెజార్టీ సంఖ్యలో ఉన్న బీసీలకు రాజకీయ పార్టీ అవసరం ఉందన్న ఉద్దేశంతో పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.