– అధికారంలోకి వచ్చిన 48 గంటల వ్యవధిలోనే వాగ్దానాల అమలు
– అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావం
-మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్ది
రంగారెడ్డి: తలసరి ఆదాయంలో రంగారెడ్డి జిల్లా అగ్రభాగంలో నిలిచిందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
2024-25 ఆర్థిక సర్వే ప్రకారం యావత్ భారతదేశంలోనే రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిసిచింది అంటే అది రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతుందన్నారు. గుర్గాగ్రామ్ జీ. డి.పి 9.05 లక్షలు,బెంగుళూరు అర్బన్ 8.93 లక్షలు,గౌతమబుద్ధ నగర్/నోయిడా 8.40 లక్షలు,సంలేనా 8.10 లక్షలు,గోవా 7.63 లక్షలు,సిక్కిం 7.46 లక్షలు, దక్షిణ కన్నడ 6.69 లక్షలు,ముంబై 6.57 లక్షలు, అహ్మదాబాద్ 6.54 లక్షలు ఉండగా అన్నింటికీ మించి 11.46 లక్షల జీడీపీ తో రంగారెడ్డి జిల్లా అభివృద్ధి పథంలో దూసుక పోతుందని ఆయన పేర్కొన్నారు.
రంగారెడ్డి జిల్లా కొంగర్ కలాన్ లోని రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం ఉదయం జరిగిన ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అమరుల త్యాగాల ఫలితమే నాటి హైదరాబాద్ రాష్ట్రం నేటి తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావమని ఆయన తెలిపారు.నిరంతర పోరాటం ద్వారానే ప్రజల ఆకాంక్ష నెరవేరిందని ఆయన చెప్పారు.
మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్ ప్రయాణం ,500 రూపాయల కే నిరుపేదలకు గ్యాస్ సిలిండర్ల పంపిణీ,గృహజ్యోతి పధకం కింద దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా సరఫరా చేస్తున్న అంశాన్ని ఆయన గుర్తు చేశారు.
దశాబ్ద కాలంగా తెల్ల రేషన్ కార్డుల కొరకు నిరీక్షిస్తున్న నిరుపేదలకు 51,874 కొత్త తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేశామన్నారు.
ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుండి 10 లక్షలకు పెంపు వంటి అమలు ప్రభుత్వ దార్శనికతకు అద్దం పడుతోందన్నారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కోటి 26 లక్షల మంది రైతులకు నాలుగు విడతలలలో 769.53 కోట్ల రుణమాఫీ జరిగిందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పధకాలతో ఎక్కువగా ప్రయోజనం పొందుతుంది రంగారెడ్డి జిల్లా ప్రజలని ఆయన తెలిపారు.
ఉచితంగా ఆర్.టి.సి బస్సులలో ప్రయమిస్తున్న మహిళలకు జారీ చేయబడిన జీరో టికెట్ల సంఖ్య 33.66 కోట్లు ఉండగా మహిళల ఆదా అయిన మొత్తం 1,462 కోట్లు రూపాయలని ఆయన చెప్పారు.500 రూపాయలకు అందిస్తున్న సిలిండర్ పథకం కింద 2.11 లక్షల కుటుంబాలకు 8.28 లక్షల సిలిండర్లు సరఫరా చేయగా వాటికి ప్రభుత్వం చెల్లించిన సబ్సిడీ 24.79 కోట్లని ఆయన చెప్పారు.
రంగారెడ్డి,హైదరాబాద్, సికింద్రాబాద్ లను కలిపి ప్రపంచంలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం గల నగరంగా రూపొందించాలి అన్నదే ప్రభుత్వ సంకల్పం అన్నారు .ఇందులో ఏ.ఐ సిటీ,ఫార్మా సిటీ,లైఫ్ సైన్సెస్ హబ్ లు,సూపర్ సిటీ లు అంతర్భాగంగా ఉంటాయన్నారు.