– ప్రాంతీయ పార్టీలలో కేవలం భజన బృందాలకు మాత్రమే స్థానం
(ఫణికుమార్)
పాపం సజ్జల శకునిమామ గా మారిపోయాడు. ఆయనను పావుగా వాడుకుని పోతురాజును…..అంతే. నాకు తెలిసిన సజ్జల వేరు. పార్టీ గొంతుక. ఆయన వినిపించి విమర్శలను ఎదుర్కోవడం, గరళాన్ని కంఠంలో …….అంతే.
అన్ని సంవత్సరాలు అధికారంలో ఉండి , కంటి నిండా నిద్రపోయి వుంటారంటారా ? నేటికీ వెంటాడుతున్న భయాలు, విమర్శలతో ఓహ్. ఇలాంటి వ్యక్తి తెలుగుదేశంలో ఏ ఒక్కరూ లేరు. అంటే అవకాశమూ లేదు. బలి పశువులే ఇక్కడ ఎక్కువ. అందులో పార్టీలో సమాంతర వ్యవస్థను నడిపే దమ్ము ఉన్న వారు అని పేరు తెచ్చుకున్న వాళ్లు కూడా, ఇప్పుడు ఏకాదశి భోజనం చేస్తున్నారు.
మోడు చెట్టుకు నీళ్లు పూయకూడదనే ఆత్మ సౌందర్యం, మనిషి పరిపక్వతను సూచిస్తుంది. కఠోర సత్యాలు- కాస్త కుదుపులు వుంటాయి. నారాయణ మూర్తి సినిమా ప్రస్తుత రాజకీయ వ్యవస్థకు దర్పణం. ప్రతి పార్టీలోనూ ఇది షరా మామూలే. కానీ ప్రాంతీయ పార్టీలలో కేవలం భజన బృందాలకు మాత్రమే స్థానం ఉంటుంది. ఇది కొత్త ఏమీ కాదు.