– జగన్కు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సలహా
అమరావతి: జగన్ తన 10ఎమ్మెల్యే లు అసెంబ్లీ కి రాకపోవటమే కాకుండా సమస్యలని గాలికి వదిలేశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూడలేకపోతున్నారు. గత ప్రభుత్వంలో మెడికల్ కాలేజ్ ల కోసం కేంద్రం నిధులు విడుదల చేసినప్పటికి వాటిని పక్క దారి పట్టించారని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే…
10లక్షల కోట్ల కి పైగా అప్పులు చేశారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలని రెండు విడతల వారీగా పూర్తి చేయాలనే సంకల్పం తో ముందుకి వెళ్తున్నాం… 150 అండర్ గ్రాడ్యుయేషన్ సీట్లు 625 పడకల కాలేజ్ లని నిర్మిస్తున్నాం. జగన్ పాలనలో పెత్తనం ప్రభుత్వానిది డబ్బులు ప్రైవేట్ వారిది. జగన్ జైలులో ఉన్నప్పుడు వదిలిన షర్మిలని ఇప్పుడు ఆమెతోపాటు తల్లిని వదిలేశారు. గత ప్రభుత్వంలో అమరావతిని రోడ్లని, మంచినీటి వ్యవస్థను ఇలా అన్నింటిని పట్టించుకోలేదు.
ఈ కూటమి ప్రభుత్వం ఒక పద్ధతిలో అభివృద్ధి చేస్తోంది. కేంద్ర మంత్రి నడ్డా ఏపీకి వచ్చి మంచి మాట చెప్పారు. ‘ప్రజల మదిలో మోదీ… మోదీ మదిలో ఆంధ్రప్రదేశ్’ అని నడ్డా తెలిపారు. పులివెందులలో జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొందటం మంచి పరిణామం. చంద్రబాబు రాజకీయ అనుభవంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతోంది. జగన్ 10లక్షల కోట్లు అప్పులు చేస్తే కూటమి ప్రభుత్వం లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొస్తోంది.
మరొకసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది.
జగన్ రెడ్డి ని నామ రూపాలు లేకుండా చేయాల్సిన సమయం వస్తుంది. సూటు కేసులు కంపెనీ పెట్టి విదేశాలకి డబ్బుని తరలించావు… మీ సమస్యలెంటో అసెంబ్లీకి వచ్చి తెలియచేయచ్చు.. అందరి తరుపు మైక్ నువ్వే తీసుకుని మాట్లాడు… అవసరమైతే మీడియా పాయింట్ ని వినియోగించుకో… మీరు వదిలేసిన పనులన్నీ మేం పూర్తి చేస్తున్నాం.