– కార్యక్రమాన్ని ప్రారంభించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చంద్రరావు
హైదరాబాద్: భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా నిర్వహిస్తున్న సేవా పక్షం కార్యక్రమాల్లో భాగంగా, బీజేపీ తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో ప్రజల సంక్షేమం కోసం వైద్య శిబిరం, కాన్సర్ స్క్రీనింగ్ బస్సు ఏర్పాటు చేశారు. వారికి కాన్సర్ అవగాహన, స్క్రీనింగ్ సేవలు అందించారు. ఈ కార్యక్రమాన్ని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ప్రారంభించారు.
కార్యక్రమంలో మల్లారెడ్డి, శిల్పా రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, సుభాష్ రెడ్డి, ఫణి, కృష్ణ తదితర నాయకులు, అలాగే జిల్లా, అసెంబ్లీ స్థాయి నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఆరోగ్య పరిరక్షణ, ముందస్తు గుర్తింపు, సురక్షిత జీవనశైలి గురించి అవగాహన కల్పించడం ప్రధాన లక్ష్యంగా నిలిచింది.