హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్కు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎన్టీఆర్ కాలికి స్వల్ప గాయాలయ్యాయి. ఓ యాడ్ చిత్రీకరణ సమయంలో ఎన్టీఆర్ గాయాలయ్యాయి. డ్రాగన్ సినిమాతో పాటు యాడ్ చిత్రీకరణలో విరామం లేకుండా ఎన్టీఆర్ పాల్గొంటు న్నారు.
ఎన్టీఆర్కు జరిగిన ప్రమాదంపై ఆయన కార్యాలయ సిబ్బంది ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రమాదంలో ఎన్టీఆర్కు స్వల్ప గాయాలు అయ్యాయని, వెంటనే ఆయనను హాస్పిటల్కు తరలించామని వివరించారు.
ఎన్టీఆర్కి రెండు వారాల పాటు బెడ్ రెస్ట్ తీసుకోమని వైద్యులు సూచించినట్లు తెలిపారు. ఎన్టీఆర్కు ప్రస్తుతం వైద్య చికిత్స అందుతోందని, ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదని తెలిపారు.