– కాపుల బీసీ రిజర్వేషన్ కోసం ఆమరణ దీక్ష చేస్తా..
– రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్ హెచ్చరిక
విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం దొమ్మరులను వారి సామజిక గుర్తింపు మారుస్తూ గిరి బలిజగా జీవో నెంబర్ 5 విడుదల చేయడాన్ని ఖండిస్తునట్టు రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పు పడుతూ శుక్రవారం విజయవాడ లో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో చందు జనార్దన్ మాట్లాడుతూ కులాలమధ్య విభేదాలు సృష్టించాల్సిన అవసరం కూటమి పెద్దల కెందుకని బలిజలపై కక్ష సాధింపు విడ నాడాలని సూచించారు. తక్షణం గిరి బలిజ జి ఓ ను రద్దు చేయాలనీ డిమాండ్ చేశారు.
దశాబ్దాల నుండి పరిష్కారానికి నోచుకోనిబీసీ రిజర్వేషన్ కోసం పోరాడాలని అందుకోసం రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులుచందు జనార్దన్ ఆమరణ నిరాహార దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. కాపు జె.ఎ.సి.సమావేశం గతం లో తీర్మానించిన కాపు,బలిజ, తెలగ, ఒంటరి, తూర్పుకాపు, మున్నూరుకాపుసమస్యలపై దశలవారి ఉద్యమ కార్యాచరణను రూపొందించడమే కాక అన్ని జిల్లాలలో పర్యటనలు, సమావేశలు, రౌండ్ టేబుల్ సమావేశాలలో పాల్గొననున్నట్లు తెలిపారు,. పెద్దన్న పాత్ర పోషించి కూటమి ప్రభుత్వాన్ని కాపులు అధికారం లో కి తీస్తే బలిజ కాపు వర్గాలను అనగదో క్కుతున్నారని చందు జనార్దన్ ఆగ్రహం వ్యక్తం చేసారు.