– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
– భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసిన నల్గొండ, సూర్యాపేట జిల్లా, గజ్వేల్, సంగారెడ్డి నియోజకవర్గాల ఆర్ఆర్ఆర్ బాధితులు
హైదరాబాద్ నల్గొండ జిల్లాలో రీజినల్ రింగ్ రోడ్డు వల్ల ఎవరికీ ఇబ్బంది లేకుండా చూస్తామని కేంద్రంలోని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వంటి నేతలంతా హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఇచ్చిన హామీల వల్లనే రీజినల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన రైతులు కాంగ్రెస్‌కు ఓట్లు వేసి ఆ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత అదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు రీజినల్ రింగ్ రోడ్డుతో రైతులకు తీవ్రంగా నష్టం చేస్తున్నది. నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఓట్లు గెలిచి, సీట్లు గెలిచిన తర్వాత అందరినీ మర్చిపోయారు.ఎక్కువ శాతం మంది ఆధారపడిన వ్యవసాయ రంగానికి, ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చి వ్యవసాయ రంగాన్ని సుభిక్షం చేశాం.
తమ పదవులను కాపాడడం కోసం, ఢిల్లీకి పైసలు పంపించడం కోసం కమిషన్ల దందా చేయాల్సి వస్తుంది. రీజినల్ రింగ్ రోడ్డు బాధితుల కోసం అలైన్‌మెంట్‌ను అడ్డగోలుగా మార్చిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పైన కిషన్ రెడ్డి లేఖ రాశారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా స్పందించలేదు. రీజినల్ రింగ్ రోడ్డు బాధితుల అంశాన్ని పార్లమెంట్లో, రాజ్యసభలో మాకున్న నలుగురు ఎంపీలతో లేవనెత్తుతాం. అసెంబ్లీలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించి ప్రభుత్వాన్ని నిలదీస్తాం..
కానీ రాష్ట్ర ప్రభుత్వానికి అసెంబ్లీ పెట్టే ధైర్యం లేదు.. రీజినల్ రింగ్ రోడ్డు బాధితులంతా ఐకమత్యం ప్రదర్శిస్తే కాంగ్రెస్ పార్టీ స్వార్థపూరితంగా మార్చిన అలైన్మెంట్ వల్ల నష్టం జరగకుండా ఉంటుంది.
రీజినల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన అంశంలో నష్టపోతున్న అన్ని గ్రామాల ప్రజలు ఒక్కతాటిపైకి వచ్చి ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలియజెప్పాలి.. గ్రామ గ్రామాన తీర్మానాలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాలి. ఇలా చేస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ దిగి వస్తాయి. వారి దృష్టికి మీ సమస్య వెళ్తుంది.
కాంగ్రెస్ పార్టీకి అలైన్మెంట్లు మార్చి పేదల, రైతుల జీవితాలను ఆగం చేయడం కొత్త కాదు.. కాంగ్రెస్ పార్టీకి ఈ అంశం కొత్తది కాదు. గతంలో కూడా ఔటర్ రింగ్ రోడ్డు విషయంలో ఇలాగే చేసింది.
ఆరోజు గతంలో మా ప్రభుత్వ హయాంలో భూ సేకరణ సమస్యలు ఉన్నప్పుడు నేరుగా రాష్ట్ర ప్రభుత్వం వారందరితో మాట్లాడింది.. వారందరితో నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మంత్రులంతా ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ చర్చలు నిర్వహించి, సముదాయించి భూములను ప్రాజెక్టులకు ఇచ్చేలా చేశారు. వారికి కావలసిన శాశ్వత పరిష్కారాలను చూపించారు, అవసరమైన పునరావాసం కల్పించారు.
అదేవిధంగా రీజినల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన అంశంలో రైతన్నలకు తగిన పరిష్కారం ఇవ్వాలి.. వారికి తగిన పరిహారం ఇచ్చేలా చర్చించి నిర్ణయం తీసుకోవాలి. ఎక్కడికక్కడ రైతన్నలతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు నిర్వహించాలి..
తెలంగాణ భవన్ అనేది జనతా గ్యారేజ్. మీరు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు. ఇక్కడ ఉన్న న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపి చర్చలు చేయవచ్చు, సహకారం తీసుకోవచ్చు, సలహాలు తీసుకోవచ్చు.. రీజినల్ రింగ్ రోడ్డు బాధితుల పోరాటానికి మా పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది… మా పార్టీ పూర్తి అండగా ఉంటుంది..
శాస్త్రీయబద్ధంగా రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ జరిగేదాకా పార్టీ అంతా రైతన్నలకు అండగా ఉంటుంది..ఈ అంశంలో రైతన్నలు ఆత్మస్థైర్యం కోల్పోకుండా ధైర్యంగా ఉండాలి. ఎవరు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మానసిక స్తైర్యంతో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాము. .
పది సంవత్సరాలపాటు అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలను నల్గొండ జిల్లాకు అందించినా, ప్రజలు మాత్రం కాంగ్రెస్ చెప్పిన మాటలను నమ్మి వారికి ఓటేశారు… అయినా నల్గొండ జిల్లా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన అన్యాయం చేస్తుంది..
తరతరాలుగా పట్టిపీడించిన ఫ్లోరైడ్‌ను కేసీఆర్ గారు మిషన్ భగీరథతో ఇంటింటికి నీరిచ్చి జిల్లా నుంచి తరిమివేశారు. కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో ప్రజల సంపద భారీగా పెరిగింది. మా ప్రభుత్వానికి పరిపాలనలో ప్రాధాన్యతలు ఉండడం వలన ఇది సాధ్యమైంది.
సమావేశంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డితోపాటు ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులు, ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.