– డీఎస్సీ లో విజయం సాధించిన పెనుకొండ నియోజకవర్గం నుండి 59 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందచేసిన మంత్రి సవిత
అమరావతి: రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన అతిపెద్ద డీఎస్సీని విజయవంతంగా పూర్తి చేసిన కూటమి ప్రభుత్వం… 15,941 మంది ఎంపికైన అభ్యర్థులకు ఒకే రోజు ఒకే వేదిక నుంచి నియామక పత్రాలు అందించడం ఒక చరిత్ర..
ఎన్నికల హామీ మేరకు కూటమి ప్రభుత్వం 150 రోజుల్లో మెగా డీఎస్సీని విజయవంతంగా పూర్తి చేసి, నియామక పత్రాలు అందచేశారు. అభ్యర్థులందరికి అభినందలను తెలియచేసిన మంత్రి సవిత . అదేవిధంగా. డీఎస్సీలో విజయం సాధించిన పెనుకొండ నియోజకవర్గం నుండి 59 మంది అభ్యర్థులకు రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖల మంత్రి సవిత నియామక పత్రాలు అందశారు.