– కన్నాంబకు ఎక్కువ-కాంచనమాలకు తక్కువ
జగ్గయ్యకు ఎక్కువ నాగయ్యకు తక్కువ
మన చెవిరెడ్డి అన్న జడ్జీల ముందు బోరుమని ఏడుస్తున్నాడు. నాకు ఒంట్లో బాగోలేదు మా తిరుపతి స్విమ్స్ కు పంపించేయండి అని వేడుకొంటున్నాడు. పోలీసులు కనిపిస్తే శాపనార్థాలు పెడుతున్నాడు. జైలులో గోడలను తన్నుతున్నాడు అని ఓదార్చడం కోసం, విచారణ నిమిత్తం విజయవాడ ఏసీబీ కోర్టుకు హాజరైన సందర్భంగా కోర్టు ప్రాంగణంలో ఏపీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టు అయిన మాజీ శాసనసభ్యులు, వైఎస్సార్సీపీ ఒంగోలు పార్లమెంట్ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి గారిని, కలిసిన ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ నాయకులు కలిశారు.
వారికి షాక్ ఇస్తూ.. విజయవాడలో వేడికి బాగా గాలి తగిలే తెల్లటి పంచ, ఇస్త్రీ చొక్కాలో పెళ్లి కొడుకులా కనిపించి వచ్చిన వారిని ఓదార్చాడు.
ఈ అపురూప దృశ్యాలను వైకాపా సోషల్‌మీడియా పేజీలో, సాక్షిలో ప్రచారం చేశారు. జడ్జీలు కూడా మొబైల్, టీవీలు చూస్తారు కదా.
వార్నీ. ఇంత పెద్ద ఏక్టర్ చేసే ఏక్టింగ్ మళ్లీ మళ్లీ చూడాలి అనుకోరా?
ఇవ్వాళ ఏపీ లిక్కర్ కేసులో 8 మంది నిందితులకు అక్టోబర్ 6 వరకు రిమాండ్ పొడిగించారు. కొడుకు కూడా త్వరలోనే తోడుగా రాబోతున్నాడు. ఇంకా మంచి మంచి ఇరగదీసే ఏక్టింగ్ కోసం ఎదురుచూడవచ్చు.
– చాకిరేవు