– సుధాకర్ కుటుంబ సభ్యులను మానసిక క్షోభ,అవమానానికి గురి చేయొద్దు
– ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి సురేష్ బాబు
అమరావతి: డాక్టర్ సుధాకర్ ను నడిరోడ్డుపై చేతులుకట్టి అర్ద నగ్నంగా ఉన్న ఫోటోలను ఫ్లెక్సీలుగా పెట్టటం అవమానవీయమని ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి సురేష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. సుధాకర్ కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా మరణించిన వ్యక్తి ఫ్లెక్సీలు వేసే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు.
ఇలాంటి చర్యల వల్ల సుధాకర్ కుటుంబం వివక్షకు గురి అవటమే కాకుండా సమాజానికి దూరం చేసినట్లు అవుతుందన్నారు. గౌరవప్రదమైన వైద్యుడి వృత్తిలో ఉండి వేధింపులకు గురై మరణించిన ఎస్సీ అధికారి డాక్టర్ సుధాకర్ కు చనిపోయాక కూడా ఇలాంటి అవమానాలు జరగటం అత్యంత బాధాకరమన్నారు. సుధాకర్ మరణానికి కారకులైన బాధ్యులపై ఇంతవరకు ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదన్నారు.