– ప్రభుత్వ వైఫల్యాలు బయటపడకుండా వైయస్సార్సీపీ పై విమర్శలు
– కోనసీమలో కొబ్బరిచెట్లపై పవన్ పచ్చి అబద్దాలు
– 40 ఏళ్లుగా ఉప్పునీటి సమస్యతో నాశనమవుతున్న చెట్లు
– ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్
– తనను ప్రశ్నిస్తే మాత్రం తట్టుకోలేకపోవడం పిరికితనం
– డిప్యూటీ సీఎంగానే కాదు… రాజకీయాలకూ పవన్ అనర్హుడు
– ట్రైనీ సీఎంగా వ్యవహరిస్తున్న లోకేష్
– తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు
తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ లు ఒకవైపు రాష్ట్రాన్ని దోపిడీ చేస్తూనే మరోవైపు కక్ష సాధింపు రాజకీయాలు పాల్పడుతున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిద్దరికీ పల్లకీ మోస్తూ… డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం తన వాటా అందుకుంటున్నారని మండిపడ్డారు. అందులో భాగంగా ప్రభుత్వ వైఫల్యాలు బయటపడిన ప్రతిసారీ.. వైయస్సార్సీపీని విమర్శించడం అలవాటుగా మారిందన్నారు.. మంత్రి నారాలోకేష్ రాష్ట్రంలో విద్యారంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించాడన్నారు.
సంక్షేమ హాస్టళ్లు అత్యంత అధ్వాన్నంగా తయారైన… లోకేష్ తన శాఖ తప్ప అన్నింటిలోనూ జోక్యం చేసుకుంటూ సకలశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నాడని చెప్పారు. . కోనసీమలో కొబ్బరిచెట్లపై పవన్ కళ్యాణ్ పచ్చి అబద్దాలు చెబుతున్నాడని… 40 ఏళ్లుగా ఉప్పునీటి సమస్యతో చెట్లు నాశనమవుతుంటే.. ఆ నెపాన్ని వైయస్.జగన్ పై నెట్టే ప్రయత్నం చేయడాన్ని తప్పు పట్టారు. రైతులు వాస్తవాలు వెల్లడిస్తూ. తనను తిరిగి ప్రశ్నిస్తే తట్టుకోలేని పిరికి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పారు.
పవన్ డిప్యూటీ సీఎంగానే కాదు.. రాజకీయాలకూ అనర్హుడని స్పష్టం చేశారు. దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కూడా తనవంతు వాటా అందుకుంటున్నా రు. అనుక్షణం చంద్రబాబుని మోయడం, వైఫల్యాలను కప్పిపుచ్చడమే ఈ దత్తపుత్రుడి ఉద్యోగం. వైఫల్యాలు బయటపడినప్పుడు వైయస్సార్సీపీని విమర్శిస్తూ ఉంటా రు. . నారా లోకేష్ పేరుకే విద్య, ఐటీ శాఖ మంత్రి. కానీ సకల శాఖల మంత్రిలాగా తన శాఖలు తప్ప అన్నింట్లో వేలు పెడతా రు. పాడైపోయిన ఆహారం, పురుగులన్నం, కామెర్లతో విద్యార్థుల మరణాలు.. ఇవన్నీ నిత్యకృత్యమైపొయాయి. ఇన్ని దారుణాలు జరుగుతుంటే వాటిని వదిలేసి భారీ ఆదాయాలు వచ్చే రెవెన్యూ, హోంశాఖ, ఆర్థిక, పరిశ్రమల శాఖల్లో పప్పుగుత్తి పెట్టి తిప్పుతున్నారు. . ఆయన వ్యవహారం ట్రైనీ సీఎంలా ఉంది. ఇలాంటి పనులు చేస్తూనే ప్రజల ముందు ప్రవచనకర్తగా మారిపోయి నీతులు చెబుతుంటారు.
సమాజంలో తానొక గొప్ప వ్యక్తిగా ప్రమోట్ కావడం కోసం చేసిన ప్రయత్నమే ఇదంతా. ఇది చదివిన వాళ్లంతా లోకేష్ మంచివాడు అనుకోవాలనేదే వారి ప్రయత్నం. టీడీపీలో తనను వ్యతిరేకించే వారిని కూడా వదలకుండా పెయిడ్ గ్యాంగ్‌తో టార్గెట్ చేయించడం ఆయనకు వెన్నతోపెట్టిన విద్య. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ అనుక్షణం వైయస్సార్సీపీని దూషిస్తూ చంద్రబాబుని పొగుడుతూ దత్తపుత్రుడనే పేరును సార్థకం చేసుకుంటున్నాడు. 40 ఏళ్లుగా ఉప్పు నీటి కారణంగా లక్షల ఎకరాల్లో కొబ్బరి తోటలు నాశనం అవుతున్నాయని రైతులు వాపోతుంటే, వైయస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక 2019 నుంచే నాశనం అవుతున్నాయని మీడియా ముందు చిత్రీకరించబోయి ఖంగుతిన్నాడు.
తను చంద్రబాబు దగ్గర గడ్డి కరిచినట్టు రైతులు కూడా ఉంటారనుకుని పొరబడిన పవన్ కళ్యాణ్‌కి రైతులు బాగా గడ్డి పెట్టారు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని గప్పాలు కొట్టుకునే పవన్, రైతులు ప్రశ్నిస్తుంటే భయపడిపోతున్నాడు. ఆఖరుకి పార్టీ అభిమానులు ప్రశ్నిస్తుంటే మైకులు కట్ చేయించిన పవన్ కళ్యాణ్, సామాన్య ప్రజలు ప్రశ్నించడం మొదలుపెడితే ఇంకేం సమాధానం చెబుతాడో అర్థం చేసుకోవచ్చు. మీరు చెప్పారని టీడీపీకి మద్ధతిచ్చాం.. అని చెప్పగానే మైక్ కట్ చేయించాడంటే ప్రజా వ్యతిరేకత ఆయనదాకా వచ్చిందనే అర్థం. 100 శాతం స్ట్రైక్ రేట్ ఇచ్చిన ప్రజలకు సమాధానం చెప్పే బాధ్యత పవన్ కళ్యాణ్ కి లేదా? ఇది పిరికితనం కాదా? ఇంకో 15 ఏళ్లు మేమే అధికారంలో ఉంటామని చెప్పే పవన్ కళ్యాణ్.. మొదటి ప్రశ్నకే ఎందుకు మైకు కట్ చేయించాడు.
కోనసీమ పచ్చగా ఉందని ఈర్ష్యతో తెలంగాణ కోరుకున్నారని చెప్పడం చూస్తుంటే మతి భ్రమించి ఉంటుందేమో అనిపిస్తుంది. ప్రశ్నకు సమాధానం చెప్పలేని నువ్వు ఉప ముఖ్యమంత్రిగా కాదు కదా మంత్రిగా కూడా పనికిరావు పవన్ కళ్యాణ్. ప్రశ్నకు సమాధానం చెప్పలేని… ప్రశ్నించడానికి పుట్టిన నీకు ఏమిటీ ఖర్మ అని ప్రశ్నిస్తున్నాను. ప్రపంచంలో ఏ నగరంలోనూ నీళ్లు ఎత్తిపారబోసే పరిస్థితి అమరావతిలో తప్ప ఎక్కడా లేదు. ఇప్పటికే అమరావతి పేరుతో రూ.52 వేల కోట్లు అప్పుతెచ్చారు. ఇంకా తెస్తూనే ఉన్నారు. దోచుకుంటూనే ఉన్నారు. అందులో కొంత లోకేష్, పవన్ కళ్యాణ్ దాచుకుంటున్నారు. 15 యేళ్లు కూటమి కలిసుండదని భయం ఆవహించింది కాబట్టే… కలిసుంటాం అని పదే పదే చెబుతున్నారు. వైయస్.జగన్ అధికారంలోకి వస్తాడని అనుకుంటున్నారు కాబట్టి.. రాడు అని చెుతున్నారు. ఇది వాళ్ల భయం