కల్తీ నెయ్యి కేసులో సుప్రీంకోర్టు సిట్ విచారణకు రమ్మంటే…
ప్రెస్టీజ్ కోసం పోయి, హైదరాబాద్లో ఇంటికి రమ్మన్నారు. .
ఇవాళ పరకామణి కేసులో సీఐడీ విచారణకు మాజీ టీటీడీ ఛైర్మన్, జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి విజయవాడలో హాజరయ్యారు. రెండు రోజుల క్రితం నాటి ఈవో ధర్మారెడ్డి, సీ.ఎస్.వో నరసింహ కిషోర్లను విచారించిన సీఐడీ అధికారులు… ఇవాళ వైవీ సుబ్బారెడ్డి స్టేట్మెంట్ను రికార్డు చేశారు. విచారణ అనంతరం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ… “పరకామణి కేసులో సమగ్ర దర్యాప్తు జరపాలి. దోషులు ఎవరో నిగ్గు తేల్చాలి. దోషులకు కోర్టు ద్వారా శిక్ష పడాలి. మీ హయాంలో జరిగింది కాబట్టి విచారణకు పిలిచామని చెప్పారు.
ఎవరిని పిలిచినా, ఎవరిని విచారించినా రాజకీయం చేయొద్దు. తప్పు ఎవరు చేసినా తప్పే. చేసిన దోషులను శిక్షించాలని మేము చెప్తున్నాం. నన్ను పిలిచినా, భూమన కరుణాకర్ రెడ్డిని పిలిచినా విచారణ కోసమే పిలిచారు,” అని పేర్కొన్నారు. గంటన్నరపాటు జరిగిన విచారణలో సీఐడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చానని అన్నారు. చూస్తుంటే పరకామణి కేసులో ఫిర్యాదు చేసిన నాటి విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ను చంపేసి కూడా కరుణాకర్ రెడ్డి ఇంకా ఆత్మహత్య అని బుకాయిస్తుంటే… బాబాయికి భయం వేసినట్లుంది.
తన స్టేట్మెంట్ ఏదో ఇచ్చేస్తే తన ప్రాణాలకు ప్రమాదం ఉండదని భావించినట్లున్నారు. పనిలో పనిగా “తనను పిలిచినా కరుణాకర్ రెడ్డిని పిలిచినా విచారణ కోసమే పిలిచారని” కరుణాకర్ రెడ్డి పేరు గుర్తు చేశారు. వర్షం కురిసిన రాత్రిపూట, నదిలో తోసిన శవం కొట్టుకు పోయి, ఒడ్డునపడి, అస్తిపంజరంగా కనిపించే హారర్ సీన్లు గుర్తుకువచ్చేలా.. సిఐ సతీష్ మర్డర్ తరువాత, కరుణాకర్ రెడ్డి గారేమా అస్థిపంజరం అమ్మ పేరు, నైలు నది, తిరుపతిలో వర్షం అని గజిబిజిగా కోడ్ భాషలో మాట్లాడుతూ.. గజగజ వణికిస్తున్నారు.
– చాకిరేవు