– తెలంగాణ ప్రభుత్వం ఎక్కడిది?
– కాంగ్రెస్ వాళ్ళ లాగా మూర్ఖుల్లా మేము మాట్లాడం
– దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ భవన్ లో రేపు జరిగే కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించి మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి ,ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ..
హైదరాబాద్: కెసిఆర్ దీక్ష ఒక చరిత్ర. కొంతమంది సోయిలేని మాటలు మాట్లాడుతున్నారు. తెలంగాణ రాకపోతే కాంగ్రెస్ ఎక్కడిది. తెలంగాణ ప్రభుత్వం ఎక్కడిది? కేసీఆర్ మీద అవాకులు చెవాకులు పేలినంత మాత్రాన కేసీఆర్ చరిత్ర మారదు. కొత్త బిచ్చగాళ్ళు పొద్దు ఎరగరు అన్నట్లుగా కొంతమంది మాట్లాడుతున్నారు. బతుకమ్మ పేరుతో ఆనాడు చీరలు పంచితే , ఇప్పుడు ఇందిరమ్మ చీరలు అని పేరు మార్చారు. కేసీఆర్ తన పేరు పెట్టుకోలేదు. నవంబర్ 29 న తెలంగాణ భవన్ లో కేసీఆర్ దీక్షా దివాస్ ను ఘనంగా నిర్వహిస్తాం. రాష్ట్ర చరిత్ర తెలియనివాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు తెలంగాణ ఏర్పాటుప్పుడు ఎక్కడున్నారు? కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించకపోతే ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళకి పదవి ఎక్కడిది? తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇచ్చారని నిండు అసెంబ్లీలోనే కేసీఆర్ చెప్పారు. కాంగ్రెస్ వాళ్ళ లాగా మూర్ఖుల్లా మేము మాట్లాడం.



