– ‘ఇండిగో’ -‘ఎయిర్ ఇండియా’ సర్వీసుల్లో ఏర్పడిన అవాంతరాలు ఈ కోవకే చెందుతాయా?
– వాతావరణం, పొగమంచు అని సరిపెట్టుకోవడానికి వీల్లేని అనేక సాంకేతిక సందేహాలు
– మన రవాణా వ్యవస్థలోని ‘సాఫ్ట్వేర్’ అనే లొసుగును వాడుకుని నాటో/అమెరికా చేసిన దాడి ఇది – – మన విమానాలు మనవే
– కానీ వాటిని నడిపించే ‘బ్రెయిన్’ (సాఫ్ట్వేర్), వాటిని ట్రాక్ చేసే ‘రాడార్లు’, వాటి కమ్యూనికేషన్ ‘సర్వర్లు’ అన్నీ విదేశీయుల చేతుల్లో
– ‘నేషనల్ ఏవియేషన్ సెక్యూరిటీ గ్రిడ్’ ఏర్పాటు చేసి, కీలకమైన సాఫ్ట్వేర్లను స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది
ఈ వ్యాసం చదివితే మీకు వెన్నులో వణుకు పుట్టక మానదు… తప్పక చదవండి చదివించండి…
పుతిన్ పర్యటన వేళ… భారత ఏవియేషన్ పై ‘సాంకేతిక’ లేదా ‘సైబర్’ దాడి అనాలా?
పొగమంచు సాకు మాత్రమే… అసలు జరిగింది ‘సాఫ్ట్వేర్ సాబోటేజ్’?
యుద్ధం అంటే ఇప్పుడు తుపాకులు, ట్యాంకులతో చేసేది కాదు. శత్రు దేశపు మౌలిక వసతులను, రవాణా వ్యవస్థను ఎక్కడికక్కడ స్తంభించిపోయేలా చేసి, ఆ దేశాన్ని మానసికంగా దెబ్బతీయడమే ఆధునిక ‘హైబ్రిడ్ వార్ఫేర్’ (Hybrid Warfare). సరిగ్గా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన సమయంలో మన విమానయాన రంగంలో, ముఖ్యంగా ‘ఇండిగో’ (IndiGo) మరియు ‘ఎయిర్ ఇండియా’ సర్వీసుల్లో ఏర్పడిన అవాంతరాలు ఈ కోవకే చెందుతాయా?
కేవలం వాతావరణం, పొగమంచు అని సరిపెట్టుకోవడానికి వీల్లేని అనేక సాంకేతిక సందేహాలు (Technical Anomalies) ఇప్పుడు బయటపడుతున్నాయి. దీని వెనుక పాశ్చాత్య దేశాల సాఫ్ట్వేర్ సంస్థల ప్రమేయం ఉందా? ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ (డచ్ జాతీయుడు) నాయకత్వంపై ఎందుకు అనుమానాలు వస్తున్నాయి? దీనిపై పూర్తి సాంకేతిక విశ్లేషణ.
ది బ్రెయిన్ ఆఫ్ ది ఎయిర్‌లైన్: ‘రోస్టరింగ్ సాఫ్ట్వేర్’
ఒక విమానయాన సంస్థకు గుండె వంటిది దాని “క్రూ రోస్టరింగ్ సిస్టమ్” (Crew Rostering System). ఇది అత్యంత క్లిష్టమైన ఆల్గారిథమ్స్ (Complex Algorithms)తో పనిచేస్తుంది. ప్రపంచంలోని చాలా ఎయిర్‌లైన్స్, ఇండిగోతో సహా, అమెరికా లేదా ఐరోపాకు చెందిన “జీపెస్సెన్” (Jeppesen – Boeing owned) లేదా “సేబర్” (Sabre) వంటి సాఫ్ట్వేర్లను వాడుతాయి.
టెక్నికల్ కుట్ర ఎలా జరిగి ఉండవచ్చు?:
ఈ సాఫ్ట్వేర్లు ‘లీనియర్ ప్రోగ్రామింగ్’ (Linear Programming) ఆధారంగా పనిచేస్తాయి. ఇందులో “బఫర్ టైమ్” (Buffer Time) అనే ఒక పారామీటర్ ఉంటుంది. అంటే ఒక ఫ్లైట్ దిగిన తర్వాత పైలట్ మరో ఫ్లైట్ ఎక్కడానికి మధ్య ఉండే సమయం.
అనుమానం: సరిగ్గా పుతిన్ వచ్చే సమయంలో, ఈ సాఫ్ట్వేర్ బ్యాక్-ఎండ్ (Back-end)లో ఒక చిన్న ‘కోడ్’ మార్పు జరిగిందా? ఉదాహరణకు, బఫర్ టైమ్‌ను ఆప్టిమైజేషన్ పేరుతో తగ్గించడం వల్ల, ఒక్క ఫ్లైట్ 10 నిమిషాలు లేట్ అయినా, ఆ ప్రభావం (Cascading Effect) వందల ఫ్లైట్లపై పడేలా “ఆల్గారిథమిక్ ట్వీకింగ్” (Algorithmic Tweaking) జరిగిందా?
ఒక్కసారి సాఫ్ట్వేర్ “ఇన్ఫీజిబుల్ సొల్యూషన్” (Infeasible Solution) స్టేజ్‌కి వెళ్తే, దాన్ని మనుషులు (Manual Intervention) సరిచేయడం అసాధ్యం. ఇండిగోలో జరిగింది ఇదే. సిస్టమ్ మొత్తం లాక్ అయిపోయింది. ఇది యాదృచ్ఛికంగా జరిగేది కాదు.
ACARS మరియు డేటా లింక్ వైఫల్యం (Data Link Severance)
విమానం గాల్లో ఉండగా లేదా నేల మీద ఉండగా పైలట్లకు, గ్రౌండ్ కంట్రోల్‌కు మధ్య కమ్యూనికేషన్ కోసం ACARS (Aircraft Communications Addressing and Reporting System) అనే డిజిటల్ వ్యవస్థను వాడుతారు. విమానంలో బరువు (Load Sheet), రూట్ మ్యాప్ అన్నీ దీని ద్వారానే అప్లోడ్ అవుతాయి.
శాటిలైట్ శాబోటేజ్: ఈ ACARS డేటా లింక్స్ అమెరికాకు చెందిన ARINC లేదా యూరప్‌కు చెందిన SITA నెట్‌వర్క్‌ల ద్వారా నడుస్తాయి.
ఏం జరిగింది?
ఢిల్లీ, ముంబైలలో చాలా విమానాలకు “లోడ్ షీట్” అప్లోడ్ కావడంలో తీవ్ర జాప్యం జరిగింది. డిజిటల్‌గా అందాల్సిన సమాచారం అందకపోతే, పైలట్లు దాన్ని మాన్యువల్‌గా (చేతితో) లెక్కించాలి. దీనికి 30-40 నిమిషాలు పడుతుంది.
ఈ 30 నిమిషాల ఆలస్యం వల్ల విమానం తన “స్లాట్” (Slot) కోల్పోతుంది. స్లాట్ పోతే మళ్లీ గంటల తరబడి వెయిటింగ్. ఈ డేటా లింక్ సర్వర్లు పాశ్చాత్య దేశాల చేతిలో ఉండటం వల్ల, వారు కావాలని “ప్యాకెట్ లాస్” (Data Packet Loss) లేదా “లేటెన్సీ” (Latency)ని సృష్టించి మన వ్యవస్థను నెమ్మదింపజేశారా?
క్యాట్-3 (CAT-III) పైలట్ల “మాయ”: డేటాబేస్ మ్యానిపులేషన్?
పొగమంచులో విమానాన్ని దించడానికి CAT-III B సర్టిఫికేషన్ ఉన్న పైలట్లు కావాలి. ఇండిగో వద్ద వీరు సరిపడా ఉన్నారు. కానీ, పొగమంచు ఉన్న సమయంలో కాక్‌పిట్‌లో కూర్చున్నది నాన్-క్యాట్ పైలట్లు (Non-CAT pilots). ఇది ఎలా సాధ్యం?
రోస్టరింగ్ ట్యాగింగ్ ఎర్రర్: ప్రతి పైలట్ పేరు పక్కన డేటాబేస్‌లో ఒక “ట్యాగ్” (Tag) ఉంటుంది (ఉదా: CAPT_DEL_CAT3_YES).
ఒకవేళ డేటాబేస్‌లో ఒక “బగ్” (Bug) ద్వారా లేదా సైబర్ దాడి ద్వారా ఈ ట్యాగ్స్‌లో గందరగోళం సృష్టిస్తే? సిస్టమ్ CAT-3 పైలట్‌ని నాన్-క్యాట్ ఫ్లైట్‌కి, నాన్-క్యాట్ పైలట్‌ని cat -3 ఫ్లైట్‌కి కేటాయిస్తుంది.
చివరి నిమిషంలో విమానం గాల్లోకి లేచే ముందు గానీ పైలట్‌కి తెలియదు, తాను వెళ్లే విమానాశ్రయంలో దిగలేనని. అప్పుడు విమానం దారి మళ్ళించక (Diversion) తప్పదు. వందల విమానాలు ఇలా దారి మళ్లడానికి కారణం ఇదే. ఇది కచ్చితంగా “డేటాబేస్ ట్యాంపరింగ్” (Database Tampering) అని నిపుణులు అనుమానిస్తున్నారు.
FDTL అనే బ్రహ్మాస్త్రం: చట్టాన్ని వాడుకుని దాడి
భారత ఏవియేషన్ చట్టాల ప్రకారం FDTL (Flight Duty Time Limitations) చాలా కఠినం. పాశ్చాత్య శక్తులకు తెలుసు, ఒక్కసారి భారత వ్యవస్థలో చిన్న ఆలస్యం సృష్టిస్తే, ఈ చట్టమే మిగతా పని చేస్తుందని.
ఆపరేషన్
మొదట పొగమంచు పేరుతో లేదా ఫేక్ బాంబు బెదిరింపుతో విమానాన్ని 2 గంటలు ఆపండి. ఆ 2 గంటల ఆలస్యంతో పైలట్ డ్యూటీ టైమ్ (ఉదాహరణకు 10 గంటలు) దాటిపోతుంది. నిబంధనల ప్రకారం ఆ పైలట్ కాక్‌పిట్ వదిలి వెళ్ళిపోవాలి. కొత్త పైలట్ రావడానికి ట్రాఫిక్ వల్ల మరో 3 గంటలు పడుతుంది.
ఈలోపు ఆ కొత్త పైలట్ డ్యూటీ టైమ్ కూడా మొదలైపోతుంది. ఇదొక విషవలయం (Vicious Cycle). ఇండిగో సీఈఓకి ఈ ప్రమాదం గురించి తెలిసినా, “వ్యూహాత్మక మౌనం” (Strategic Silence) పాటించడం వెనుక ఆంతర్యం ఏమిటి? ముందుగానే విమానాలను రద్దు చేయకుండా (Proactive Cancellation), ప్రయాణికులందరినీ ఎయిర్‌పోర్టుకు రప్పించి, అక్కడ గందరగోళం సృష్టించడం ద్వారా అంతర్జాతీయ మీడియాలో “భారత్‌లో అరాచకం” అని హెడ్‌లైన్స్ వచ్చేలా చూడటమే దీని లక్ష్యం. visit megaminds website for more
జియో-పొలిటికల్ కోణం: GPS స్పూఫింగ్ (GPS Spoofing)
గత కొన్ని నెలలుగా మధ్యప్రాచ్యంలో జరుగుతున్నట్లుగానే, ఢిల్లీ గగనతలంపై కూడా “GPS స్పూఫింగ్” జరిగిందా అనే కోణాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు పరిశీలిస్తున్నాయి. విమానాల నావిగేషన్ సిస్టమ్‌ను తప్పుదోవ పట్టించేలా సిగ్నల్స్ పంపడం ద్వారా, భద్రతా కారణాల దృష్ట్యా పైలట్లు విమానాల మధ్య దూరాన్ని (Separation) పెంచాల్సి వస్తుంది. దీనివల్ల ఎయిర్పోర్ట్ సామర్థ్యం (Runway Capacity) సగానికి పడిపోతుంది. గంటకు 60 విమానాలు దిగాల్సిన చోట, కేవలం 30 మాత్రమే దిగుతాయి. పుతిన్ విమానం ల్యాండింగ్ సమయంలో భద్రత పేరుతో ఈ రకమైన “ఎలక్ట్రానిక్ వార్ఫేర్” (Electronic Warfare) ప్రయోగించారా?
కావాల్సింది ‘ఆత్మనిర్భర్’ ఏవియేషన్
ఇండిగో, ఎయిర్ ఇండియా సమస్యలు కేవలం నిర్వహణా లోపాలు కావు. ఇవి “సిస్టమిక్ సాబోటేజ్” (Systemic Sabotage).
ఒక దేశం (రష్యా)తో మనం స్నేహం చేస్తున్నప్పుడు, దాన్ని సహించలేని మరో కూటమి (నాటో/అమెరికా), మన రవాణా వ్యవస్థలోని ‘సాఫ్ట్వేర్’ అనే లొసుగును వాడుకుని చేసిన దాడి ఇది. మన విమానాలు మనవే. కానీ వాటిని నడిపించే ‘బ్రెయిన్’ (సాఫ్ట్వేర్), వాటిని ట్రాక్ చేసే ‘రాడార్లు’, వాటి కమ్యూనికేషన్ ‘సర్వర్లు’ అన్నీ విదేశీయుల చేతుల్లో ఉన్నాయి.
ఇండిగో సీఈఓ ఒక నాటో దేశానికి (నెదర్లాండ్స్) చెందిన వ్యక్తి కావడం, సంక్షోభ సమయంలో ఆయన నిర్ణయాలు భారత ప్రయోజనాలకు విరుద్ధంగా ఉండటం యాదృచ్ఛికం కాకపోవచ్చు. పుతిన్ వెళ్లిపోవచ్చు. కానీ ఈ ఘటన భారత ప్రభుత్వానికి ఒక హెచ్చరిక. మన “డిజిటల్ సార్వభౌమాధికారం” (Digital Sovereignty) మన చేతుల్లో లేకపోతే, భవిష్యత్తులో యుద్ధ సమయాల్లో మన విమానాలు నేలకే పరిమితం అయ్యే ప్రమాదం ఉంది. తక్షణమే ‘నేషనల్ ఏవియేషన్ సెక్యూరిటీ గ్రిడ్’ ఏర్పాటు చేసి, కీలకమైన సాఫ్ట్వేర్లను స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఈ ఆర్టికల్ రాస్తున్న సమయంలో ఇండిగో సీఈఓ ను తీసేస్తారు అని రూమర్స్ వస్తున్నాయి. ఇవన్నీ, కంటితుడుపు చర్యలే. సాంకేతికంగా మనం వేరే దేశాలపై ఆధారాన్ని తగ్గించాలి. ఇప్పుడు అర్థం అవుతోందా ప్రతి అంశంలో ఆత్మనిర్భర భారత్ ఎంత అవసరమో? ఎంత సునిశితమో?
చివరగా మరొక సందేహం: నరేంద్ర మోదీజీ ని అధికారం నుండి దించడానికి అత్యంత సున్నితమైన కూటమి పార్టీ తెలుగుదేశాన్ని లక్ష్యంగా చేసుకుని ఉండొచ్చు. మన ఏవియేషన్ శాఖామాత్యులు రామ్మోహన్ నాయుడు గారు అత్యంత ప్రతిభావంతులైన నాయకులు మరియు సాంకేతికంగా అద్భుతమైన నాలెడ్జ్ ఉన్నవారు. అమెరికాలో పర్డ్యూ అనే విశ్వవిద్యాలయంలో పట్టభద్రులయ్యి భారత్ కోసం పనిచేయడం అంటే చాలా గొప్ప విషయం. నరేంద్రమోదీజి వారిపై నమ్మకం ఉంచారు. దురదృష్టం ఏమిటి అంటే, చాలామంది జాతీయవాద మిత్రులు అటు అశ్విని వైష్ణవ్ గారిని మరియు ఇటు రామ్మోహన్ నాయుడు గారిని పక్కకు తప్పించాలని అంటున్నారు. పుతిన్ కు ఏమైనా జరిగి ఉంటే పరిస్థితి ఊహించుకోండి.,
ఆ పరమేశ్వరుడిని వేడుకుంటున్నాను, ఎందుకయ్యా భారత్ కు ఇన్ని సమస్యలు. నీ కృప భారత్ పై చూపించు. విశ్వగురు భారత్ అయ్యేలా అనుగ్రహించు స్వామీ!
– పతంజలి వడ్లమూడి
మెగామైండ్స్
085005 81928