– 70, 80 దశాబ్దుల్లో హిందీ సినిమా పూర్తిగా ఇస్లామ్ సినిమా అయిపోయింది
– విదేశీ మతం కొట్టిన దెబ్బల నుంచి దేశ సినిమా తెప్పరిల్లాలి
– విదేశీ మతోన్మాదానికి, కులం మలానికి అతీతంగా ఒక ప్రయోజనకరమైన సినిమా
– 15 ఏళ్లలోపు పిల్లలను తప్పకుండా ఈ సినిమాకు పంపాలి
– అఘోరీగా బాలకృష్ణ నటన బాలకృష్ణ తప్పితే మరొకరు చేయలేరు
అఖండ 2 సినిమా విజయంపై మిశ్రమ సమాచారం వస్తోంది. అఖండ 2 నగర ప్రాంతాల్లో అంటే ఎ సెంటర్లలో విజయం సాధించింది అని తెలియవస్తోంది. ఈ పరిణామం విశేషం!
పూర్తిగా హిందూత్వం లేదా సనాతన భావజాలం సినిమా ఎ సెంటర్లలో విజయవంతం అవడం హర్షనీయమైన పరిణామం; ప్రత్యేకంగా పరిగణించాల్సిన పరిణామం.
అన్ని రకాలుగానూ అఖండ 1 అఖండ 2 కన్నా గొప్ప సినిమా.
కథ, కథనం, ట్రీట్ మంట్, లాజిక్ వంటి విషయాల పరంగా కాకుండా.. అఖండ 2 పూర్తిగా హిందూత్వంతో నిర్మించడం దర్శకుడు, హీరో, నిర్మాతల సాహసం. ఆ సాహసం నెగ్గింది.
కులం మలం… అఖండ 2 కులం మలం సినిమా కాదు! సినిమాలో కులం దుర్గంధం లేదు…లేదు…లేదు. చాలా గొప్ప విషయం ఇది. సినిమాలో చారిత్రిక వక్రీకరణ, చారిత్రిక అసత్యాలు లేవు. అఖండ సినిమా ఒక ఫిక్షన్.
అఖండ మేధావుల సినిమా కాదు; అఖండ సినిమా ‘తంగలాన్ మేధావుల సినిమా కాదు’.
‘తంగలాన్ మేధావులు’ అంటే ఏమిటి? 2024లో తంగలాన్ అన్న ఒక అధమపు తమిళ్ష్ సినిమా వచ్చింది. అది కులం మలం సినిమా; చారిత్రిక వక్రీకకరణ, అసత్యాల సినిమా.
సినిమా అన్న స్థాయి లేని సినిమా. అందువల్లే తమిళ్ష్లో ఆ సినిమా విడుదలైన రెండో రోజే అక్కడి ప్రజల చేత ఆ సినిమా తిరిస్కరించబడింది. సినిమా అన్న విషయంగానే అది తగనిదని తమిళ్ష్ టెక్నీషియన్స్ నిర్ధారించారు.
కానీ మన తెలుగు మేధావులు ఆ తంగలాన్ సినిమాను అంత గొప్ప, ఇంత గొప్ప సినిమా అనీ, ఆ సినిమా దర్శకుడు అంత, ఇంత గొప్ప మేధావి అనీ తెగ ఊగిపోయారు; ఆ సినిమా వీర హిట్ అని నిస్సిగ్గుగా అసత్య ప్రచారం చేశారు. 100-150 మంది తెలుగు మేధావులు నికృష్టపు తంగలాన్ సినిమాను ప్రస్తుతిస్తూ తమ మేధను వాంతిచేసుకుంటూ వ్యాసాలు రాసి వాటిని ఒక సంకలనంగా కూడా తెద్దామనుకున్నారట.
అసలు తమిళ్ష్లోనే అది అసలు సినిమానే కాదు అని నిర్ధారితమైతే మన మేధావులు ఒక లెవల్లో ఊగిపోయారు! ఆ ఊగిపోయిన వాళ్లు ‘తంగలాన్ మేధావులు’. ఆ తంగలాన్ మేధావులు, ఇతర మేధావులు ఆఖండ 2పై తమ వాంతులు చేసుకుంటూనే ఉంటారు. ఆ రోగిష్టివాళ్ల వల్ల మనకు, సమాజానికి, సినిమాకు కీడు తప్పితే మరోటి జరగదు.
అఖండ 2 హిందూత్వం సినిమా. ఒక హిందూత్వం సినిమా తీసినందుకు, చేసినందుకు దర్శకుడు బోయపాటి శ్రీనుకు, బాలకృష్ణకు ప్రత్యేకమైన అభినందనలు.
Yes, we need Hindu centric and Hindu oriented films!
50వ దశాబ్దం నుంచే మనదేశ సినిమాలో ముస్లీములు, క్రిస్టిఅన్లు మంచి వాళ్లు హిందువులు చెడ్డ వాళ్లు అని చూపించే మానసిక బానిసత్వం మొదలై వస్తోంది. ముఖ్యంగా 70, 80 దశాబ్దుల్లో హిందీ సినిమా పూర్తిగా ఇస్లామ్ సినిమా అయిపోయింది. గత కొన్నేళ్లుగా మనదేశ సినిమా విదేశీ మతోన్మాదాన్ని సవాలు చేస్తూ హిందూత్వ సినిమాగా విజయవంతం అవుతోంది. ఇది శుభ పరిణామం. ఈ క్రమంలో ఆఖండ 2 ఒక అభినందనీయమైన సినిమా.
అఖండలో బాలకృష్ణ తరువాత విశేషాంశం సంభాషణలు. సంభాషణలు గొప్పగా ఉన్నాయి. సంభాషణ రచయిత అభినందనీయుడు. ఒక అఘోరీగా బాలకృష్ణ నటన బాలకృష్ణ తప్పితే మరొకరు చేయలేరు అన్నట్టు ఉంది.
గొప్ప సినిమా అని కాదు, కులం, విదేశీ మతం దుర్గంధం లేని అభిలషణీయమైన హిందూ-సినిమా అఖండ 2.
తలితండ్రులు తమ 15 ఏళ్లలోపు పిల్లలను తప్పకుండా ఈ సినిమాకు పంపాలి. విదేశీ మతోన్మాద సినిమాకు అలవాటుపడ్డ పెద్దలు కూడా అఖండ 2 ను తప్పకుండా చూడాలి. హిందువులు ఈ సినిమాను ఇంకా విజయవంతం చేయాలి.
కొన్ని దశాబ్దులుగా విదేశీ మతం కొట్టిన దెబ్బల నుంచి దేశ సినిమా తెప్పరిల్లాలి. మేధావులు, తంగలాన్ మేధావులకు అతీతంగా హిందూత్వం సినిమాలు ఉద్ధృతం అవ్వాలి. అందుకు ఈ అఖండ 2 ఇంకా విజయవంతం కావడం అవసరం.
కమ్యూనిస్ట్స్, మేధావులు, కులం మలం జీవులను తన్ని తరిమేసి.. హిందువులు ఈ అఖండ వంటి హిందూ- సినిమాలను మరింత ఆదరించాలి.
అఖండ 2 ఒక ప్రామాణికమైన, ప్రశస్తమైన సినిమా కాదు; విదేశీ మతోన్మాదానికి, కులం మలానికి అతీతంగా ఒక ప్రయోజనకరమైన సినిమా.
– రోచిష్మాన్
9444012279