ఎంతైనా ప్రతిపక్ష మేధావులు మామూలోళ్ళు కాదు…నిజంగా మేధావులు…ఒట్టు వాళ్ళే కావాలి. మా ఓట్లకు వాళ్ళే కావాలి. వాళ్ళ మార్గదర్శకత్వంలో ఢిల్లీ ర్యాలీ దద్దరిల్లింది…ఇంత మంది వెర్రి పుష్పాల గుంపును చూసి…ఆ ర్యాలీలో సత్యం ధర్మం అన్న మాటలు విని ఒళ్ళు చెమ్మగిల్లింది.
చెమ్మగిల్లిన ఒళ్ళు గమ్మునుండక ఇలా చెప్పిస్తోంది.. చెప్పాలి.
సర్ అనగానే సర్రున లేచి ఓట్లు చోరీ అనాలి…అద్భుతమైన సలహా.
ఓటు చోరీ …ఈవీఎం టాంపరింగ్ పక్కోడ్ని మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ ఓటు చోరీ ఆయుధం పనిచేయదు. బిహార్ లో ఓటింగ్ శాతం పెరగడం ఈ చోరీ కథను తీసి అవతల పారేసింది.
అంటే..తన ఓటు లేకపోతే వెళ్ళి అడిగే అవకాశం ఉన్న స్థితిలో చోరీ ని స్థానికుడు ఎందుకు ఫీల్ అవుతాడు? దొంగతనం జరగకుండా తన ఇంట్లో దొంగతనం జరిగిందని కంప్లైంట్ ఇవ్వగలగడం చాలా టఫ్. ఇప్పుడు ఒక వేళ బెంగాల్ లో ఈ ప్రచారాన్ని నమ్మినా…వాళ్ళ వరకూ వచ్చేసరికి ఓటు పోయినవాడు రోడ్డెక్కాలి కదా?
రోడ్డెక్కే ముందు..నమోదు చేయించుకోకుండా వాడికి అడ్డు పడిన అంశం ఏంటో చెప్పాలి కదా?
సో అది సాధ్యం కాదు…చివరికి మమత కూడా ఓటు నమోదు చేసుకుంది కదా? అంటే ఓటు చోరీ అంటూ రాహుల్ వస్తే…వచ్చిన జనం ఎదురింట్లో దొంగతనం జరిగింది..పక్కింటోడి పెళ్ళాం లేచిపోయింది లాంటి కబుర్లు విందామనే క్యూరియాసిటితో వస్తారు తప్ప ఇంకేమీ ఉండదు.
పత్రికల్లో ఛానెల్స్ లో వ్యాసాలు కుమ్మరించిన మేధావులు, ఎవడి ఓటు ఎటు చోరీ అయ్యిందో చెప్పగలిగారా?
అంత్య లక్ష్యాన్ని చేరే అవకాశం…నిరూపించే అవకాశం ఉన్న చోట దొంగాటలు ఆడకూడదు. కమ్యూనిస్టులు ఎందుకు విఫలం అవుతున్నారంటే…ఇందుకే! కూడులేక అన్నార్తుల ఆర్తనాదాలు అంటాడు.
అక్కడికొచ్చిన వాళ్ళ ఒక్కోక్కళ్ళింట్లో మూడు దొంగ రేషన్ కార్డులు ఉండి, నెల నెలా వంద కేజీల బియ్యం ఎత్తుకెళ్లి పోయిన వాడు ఉంటాడు.
గూడు లేని అభాగ్యులు అని చెబితే…అప్పటికే టౌన్లో నాలుగిళ్ళు ఉండి….ఉత్తగా పుక్కిటికి ఇంకో గవర్నమెంటు స్థలం రాకపోతుందా అని…గుడిసెలు వేసిన చోటకి పోరాటానికి పోతాడు.
ఏం లాభం?
వీళ్లెంచుకునేవి అన్నీ…గొంగళి పురుగు లక్ష్యాలే…ముట్టుకుంటే గుచ్చుకుంటాయి.
ఇప్పటివరకూ భారత దేశంలో అనుచిత లబ్ది …తప్పుడు మార్గాల్లో లాభం పొంది మోసం చేసిన ఓటరు ఉన్నాడేమో గానీ…నేరుగా పద్ధతిగా తీసుకున్నవాడు మోసం చేయలేదు.
అంటే దొంగ రేషన్ కార్డులు పొంది…ఓటుకి నోటు తీసుకుని అవి ఇచ్చిన పార్టీని మోసం చేశారేమో గానీ…ప్రభుత్వం నుంచి నేరుగా పద్ధతి ప్రకారం లబ్ధి పొంది…ఆ రాజకీయ పార్టీని మోసం చేయలేదు.
అసలు కీలకం.. అంతిమ లబ్ధిదారుడి ఆధారంగా పెద్ద జాతీయ స్థాయి రాజకీయం చేయకూడదు.
ప్రజలు ఎంత క్లియర్ గా ఉంటారు అంటే… ఎవడ్ని ఎంత పిండాలో స్పష్టమైన అంచనాతో ఉంటారు.
ఖాన్ గ్రేస్ బీ ఆర్ ఎస్ టీడీపీ వైసీపీ లాంటి పార్టీల దగ్గరనుంచి మొత్తం ఊడ్చేసే వరకూ గెలుపు ఓటములతో దోబూచులాడిస్తాడు.
వాళ్ళని గెలిపించి ప్రభుత్వం నుంచి పిండినంత పిండి…వ్యక్తిగతంగా సదరు నాయకుడ్నించి కూడా ఎన్నికల సమయంలో డబ్బు లాగేస్తాడు.
గెలుస్తున్న వాడి దగ్గర సేవా భావం దండిగా ఉందని కాదు. వాడి దోపిడీ సొమ్ము కూడా కక్కించే వరకూ ఈ పరుగు ఆపనివ్వడు.
వాడు ఓడి పోయే రోజు…వ్యవస్థ వాడ్ని శిక్షించే రోజు కోసం ఆగుతారు.
మధ్య మధ్యలో సేవాభావం అంకిత భావం ఉన్నవాళ్ళని గెలిపించి అసలు ఉద్దేశ్యం తెలియజేస్తూ ఉంటారు.
ఈ ఆటలో బీజేపీ నాయకులు మినహాయింపు కాదు…సిద్ధాంతం. శాశ్వత సత్యం వదిలేసి అధికారమే పరమావధిగా పరుగెత్తే వాడ్ని ఓటరు ఇలాగే ఆటలాడిస్తాడు. ఓటరుకు తెలియక కాదు.
అలా అని ఒక్క రూపాయి కూడా ఇవ్వని…ఒట్టి సిద్ధాంతం నీతి నిజాయితీలు మాట్లాడే వాడ్ని కూడా ప్రజలు పట్టించుకోరు. వ్యవస్థలో మెల్లగా దృఢమైన మార్పుని మాత్రమే సమాజం అంగీకరిస్తుంది.
అందుకే రెంటినీ…బ్యాలెన్స్ చేసుకునే నైపుణ్యం ఉన్న పార్టీగా భాజపా ఎదుగుతూ..ఒక్కొక్క రాష్ట్రాన్ని స్థిరంగా గెలుచుకుంటూ వస్తోంది.
బిహార్ లో 10వేలు పంపకం అలాంటిదే!
అక్కడ డ్వాక్రా గ్రూపు సభ్యురాలికి వ్యాపారం లేదా స్వయం ఉపాధి పొందడానికి ఆ పది వేలు ఇచ్చారు. ఆరునెలలు ఆ వ్యాపారం నడిపి చూపిస్తే…మరో 2 లక్షలు రుణం ఇస్తాం అని చెప్పారు. ఆదాయ పన్ను కట్టేవారికి, ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు పథకం వర్తించదు.
దీంట్లో నైతికత చూసారు ప్రజలు .కనీసం లబ్ధిదారుల్లో పది శాతం మంది నిజాయితీగా ఉపాధి పొందినా ఆత్మ విశ్వాసం కలుగుతుంది.
అందుకే ఎన్నికల కమిషన్ దీన్ని వదిలేసింది.
గ్రామీణులు ఒక్క వెయ్యి రూపాయలతో కూడా ఉపాధిని సెట్ చేసుకునే నైపుణ్యం కలిగి ఉంటారు.
అందుకే ఆ స్కీమ్ లో నైపుణ్యాలు పెంచుకోవడం కూడా కలిపి ఉంచారు. మొత్తం మీద ఈ లాజిక్కులన్నీ ఖాన్ గ్రేస్ కమ్యూనిస్టు మేధావులకు అర్థం కాకపోవడం చాలా అవసరం.
ఈ దేశానికి పేదరికం పోవడం ఎంత అవసరమో…ఆ రెండు పార్టీలు పోవడం అంత అవసరం. ఇంకో వైపు హిందూ జాతీయ స్పృహ అంత కన్నా పెద్ద అవసరం. అది సాధించిన రోజు మాత్రమే దేశం మనుగడ ఉంటుంది.
జాతీయ వాద దేశభక్త శక్తులు మొత్తం వంద శాతం గెలిచిన తరువాత… దారి తప్పకుండా ఉండడం కోసం…చెక్ పాయింట్స్ పెట్టడం కోసం…దేశభక్తి కలిగిన మరికొందరు ప్రతిపక్ష పాత్ర తప్పక పోషిస్తారు.
భయమే అక్కర్లేదు.
ఆలోగా ఈ మేధావుల మార్గదర్శకత్వంలోనే…మాజీ మావోల అటవీ పరిజ్ఞానంతోనే…రేవంత్ ఖర్గే రాహుల్ ప్రియాంకలు ఢిల్లీ మైదానాల్లో ర్యాలీలు…ఫుట్ బాల్ లు తన్నడాలు ఇలాగే చేస్తూ ఉండాలి.
మన తెగులు మీడియా…హస్తం హవా …ఎర్ర జెండా హల్వా లాంటి ప్రచారాలు చేస్తూనే ఉండాలి.
వంద దందాలు ఉన్న ఆ మేధావులకు కోటి దండాలు!
మీరే మాక్కావాలి…! మీరే మా ఉన్నతికి సోపానాలు!!
– అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యం