– ఈ పురస్కారాల్ని పూర్తిగా నిలిపివేయడం తెలుగు సాహిత్యానికి, కవిత్వానికి, పరిశోధనకు ఎంతో మేలు
– కమ్యూనిస్ట్, మత, కుల, అసాంఘీక, అసభ్య, అశ్లీల శక్తులకు చెప్పు దెబ్బ ఈ పురస్కారాల నిలిపివేత!
– కేంద్ర ప్రభుత్వం ఎమ్. ఫిల్., పీహెచ్. డీ.లను కూడా పూర్తిగా రద్దు చేస్తే తెలుగు సాహిత్యానికే కాదు.. తెలుగు భాషకే శుభం
తాత్కాలికంగా సాహిత్య అకాడెమి పురస్కారాలను కేంద్ర ప్రజాప్రభుత్వం నిలిపివేసింది! చాలా గొప్ప పరిణామం ఇది. ఈ పురస్కారాల్ని పూర్తిగా నిలిపివేయడం తెలుగు సాహిత్యానికి, కవిత్వానికి, పరిశోధనకు ఎంతో మేలు చేస్తుంది!
ఈ, ఇలాంటి పురస్కారాలు లేకపోవడం వల్ల తెలుగు సాహిత్యానికి, కవిత్వానికి, పరిశోధనకు నైతికత వస్తుంది; నాణ్యత వస్తుంది.
అసాంఘీక, అనైతిక, అశ్లీల, అవిద్య శక్తులు తెలుగు కవిత్వాన్ని, సాహిత్యాన్ని యాబైయేళ్లుగా తీవ్రంగా దెబ్బకొడుతున్నాయి. డబ్బు ముట్టచెప్పడాలు, పైరవీలు, కాళ్లు పట్టుకోవడాలు, పడుకోవడాలు, పడుకోబెట్టడాలు వంటి అత్యంత హేయమైన చర్యలు, కులం, కమ్యూనిజమ్, విదేశీ మతం ఈ పురస్కారాల కోసం తెగబడి పనిచేస్తూ సాహిత్యాన్ని, కవిత్వాన్ని, భాషను జుగుప్సాకరం చేసేశాయి; నాశనం చేసేశాయి. కమ్యూనిస్ట్, మత, కుల, అసాంఘీక, అసభ్య, అశ్లీల శక్తులకు చెప్పు దెబ్బ ఈ పురస్కారాల నిలిపివేత!
తెలుగులో మాత్రమే వచ్చిన, వచ్చే ఉచ్చల కవిత్వానికి, తెలుగులో ఇటీవల వచ్చిన ‘మన సినిమా ఫస్ట్ రీల్’ వంటి చదువు, నైతికత, నిజం లేని హానికరమైన పుస్తకాలకు పైరవీ వల్లో, మరోదాని వల్లో అకాడెమి పురస్కారాలు వస్తే మన జాతికే తలవంపులు వస్తాయి.
ఈ వరకే కొన్ని పురస్కారాలు విదూషకత్వంగానూ, వికృతం గానూ, అసహ్యకరంగానూ పరిణమించడం మనకు తెలిసిందే. బహుశా ఈ విషయంగానే కేంద్ర ప్రభుత్వం ఈ సరైన నిర్ణయం తీసుకుందేమో?
ఇటీవల ‘మన సినిమా ఫస్ట్ రీల్’ ఆన్న తప్పుడు, చెత్త పుస్తకానికి తెలంగాణా ప్రభుత్వ పురస్కారం రావడం, ఏనుగు నరసింహారెడ్డి రాసిన ‘తెలంగాణ రుబాయిలు’ అన్న పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయ పురస్కారం రావడం.
కేంద్ర ప్రభుత్వం ఎమ్. ఫిల్., పీహెచ్. డీ.లను కూడా పూర్తిగా రద్దు చేసేస్తే తెలుగు సాహిత్యానికే కాదు తెలుగు భాషకే శుభం జరుగుతుంది. తెలుగులో నైతికత, సంస్కారం, చదువు పెద్ద స్థాయిలో నిలబడతాయి.
20-30 శాతం మినహా 70-80 శాతం తీసిస్ లు హానికరం, చదువులేమి, కుహనా, అనవససరం, అసభ్యకరం, అభ్యంతరకరం, పనికిరాని, పనికిమాలిన కోవల్లోకి వచ్చేవే.
1960వ దశాబ్దిలో(నే) తీసిస్ లను (థీసిస్ కాదు) 6000 రూపాయలకు కొనుక్కున్న స్థితి అప్పటి నుంచీ అప్రతిహతంగా కొనసాగుతూ ఇవాళ లక్షకు పైగా పలుకుతోంది… అంతేకాదు ఈ పీహెచ్.డీ.ల విషయంలో అసభ్యత, తస్కరణ, వ్యభిచారం, ఘోస్ట్ రైటింగ్, డబ్బు వంటివి బహిరంగ రహస్యాలే!
తెలుగులో విశ్వవిద్యాలయాల చదువు, నడవడి, తీరు వికృతం, అశ్లీలం అవడం 1970ల నాటికి ఒక ఆకృతి దాల్చి ఉండచ్చు. 80ల నుంచి ఆ పరిణామం తీవ్రరూపం దాల్చింది. పలు ఉన్నత పురస్కారాలను పొందిన ఒక ప్రముఖ కవి కూడా ఈ బాధాకరమైన పరిణామానికి బలమైన కారణం.
కొంత కాలం క్రితం కుప్పం విశ్వవిద్యాలయంలో దాదాపుగా వంద పీహెచ్.డీ.లను రద్దు చేశారు! వాటిల్లో 70శాతం తెలుగు సాహిత్యం/కవిత్వం పీహెచ్.డీ.లు!! ఆ కుప్పం విశ్వవిద్యాలయంలో ఒకప్పుడు మందు, పొందు సప్లైయ్ చేసి అక్రమంగా, అనర్హంగా ఒక పెద్దస్థాయి ఉద్యోగాన్ని సంపాయించాక.. కోర్టు ద్వారా ఆ ఉద్యోగం నుంచి తన్ని తరిమెయ్యబడ్డ ఒక అనైతిక, అసాంఘీక, మత, కుల దుష్ట శక్తి గత కొన్నేళ్లుగా ఈ పురస్కారాల బ్రోకర్ అయి తచ్చాడుతున్నాడు. ఆ బ్రోకర్ అసభ్య, అసాంఘీక, అశ్లీల, మత, కుల సంగమంతోనూ, తన అనైతిక ప్రతిభ వల్ల వచ్చిన పుస్తకాలకు సంబంధించిన ఒక పదవిలోనూ తెలుగు భాషకు, సాహిత్యానికే కాదు తెలుగు జాతికే హాని చేస్తున్నాడు.
కేంద్ర ప్రభుత్వం పీహెచ్.డీ. లను కూడా రద్దు చేసేస్తే తెలుగు విశ్వవిద్యాలయాల్లో ఇకనైనా నైతికత, సభ్యత, సంస్కారం ‘చదువు’ నెలకొంటాయేమో?
తాత్కాలికంగా సాహిత్య అకాడెమి పురస్కారాలను నిలిపేసిన కేంద్ర ప్రజా ప్రభుత్వం సాహిత్యానికి, కవిత్వానికి, కళలకు పురస్కారాల విషయంలో ఇంతవరకూ జరగిన కీడును ఆపేందుకూ ఇకపై మేలు జరిగేందుకూ కావలసిన సరైన నిర్ణయం తీసుకోవాలని ఆశిద్దాం.

9444012279