– మంత్రి సవిత
– ఉత్తమ కార్యకర్తలకు ప్రశంసాపత్రాల ప్రదానం
– సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో విశేష సేవలకు గుర్తింపు
పెనుకొండ : తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అసలైన బలం, పార్టీకి ఊపిరి అని మంత్రి సవిత అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో విశేష సేవలు అందించిన ఉత్తమ కార్యకర్తలను గుర్తిస్తూ, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి గౌరవ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ప్రశంసాపత్రాలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు
పెనుకొండ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో, ఉత్తమ కార్యకర్తలుగా ఎంపికైన 151 మందికి మంత్రి సవిత ప్రశంసాపత్రాలను అందజేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కార్యకర్తలు చేసిన కృషి అభినందనీయమని ఆమె పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వ పాలన ప్రజలకు, రాష్ట్రానికి శ్రీరామరక్షగా మారిందని, తెలుగుదేశం పార్టీకి తరిగిపోని ఆస్తి కార్యకర్తలేనని మంత్రి సవిత స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా మరింత స్ఫూర్తితో ప్రజాసేవలో ముందుండి, తెలుగుదేశం పార్టీని తిరుగులేని శక్తిగా నిలపాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.