– రేవంత్ రెడ్డికి మెంటల్ డిజార్డర్
– అసెంబ్లీలో ఆన్ రికార్డులో సీఎం బూతులు మాట్లాడుతున్నారు.
– అసెంబ్లీ బీ ఆర్ ఎస్ విప్ కె.పి.వివేకానంద
హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో సభా హక్కులను ప్రభుత్వం ఉల్లఘించింది. ఆత్మ స్తుతి పరనింద లాగా అసెంబ్లీ నడిచింది. పాలసీని ప్రకటించిన తర్వాత అసెంబ్లీలో చర్చ పెట్టారు. బిజినెస్ లేకుండా అసెంబ్లీ స్టార్ట్ అయింది. హడావిడిగా 13 బిల్లులు ఆమోదించారు.
బీఏసీలో అసెంబ్లీ 15 రోజులు నడపాలని డిమాండ్ చేశాము. కానీ బీఏసీ మినిట్స్ ను ప్రభుత్వం బయట పెట్టలేదు. బీఏసీ మీటింగ్ ను టాంపరింగ్ చేశారు. సభ ఎన్ని రోజులు నిర్వహిస్తారో స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.అసెంబ్లీలో ప్రజెంటేషన్ చట్ట విరుద్ధం అని కాంగ్రెస్ చెప్పింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ అసెంబ్లీలో పీపీటీ ఇచ్చింది.
చర్చ చేయడానికి ప్రభుత్వం భయపడుతోంది. బిఆర్ఎస్ పార్టీకి మైక్ ఇవ్వమని స్పీకర్ అన్నారు. కేసీఆర్ ను తిట్టడానికి అందరూ ఏకం అవుతారు.కేసీఆర్ ను తిట్టడానికి ఐదు రోజులుగా అసెంబ్లీని నడిపారు. శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి డిప్యూటీ సీఎంను ఉద్దేశించి ప్రభుత్వం తీరుపై వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలి.
ఇందిరమ్మ ఇళ్ళపై స్పీకర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని సభలో ప్రశ్నించారు. మంత్రులు సభలో చెప్పే మాటలకు చేసే పనులకు తేడా ఉందని అంటున్నారు. బిఆర్ఎస్ బాయ్ కాట్ చేసిన తర్వాత అసెంబ్లీలో సభ్యులు నిద్రపోయారు. సభను,సాంప్రదాయాలను మంట కలిపారు. అసెంబ్లీని గాంధీ భవన్ లా, జూబ్లీహిల్స్ ప్యాలెస్ లా నడిపారు.
అసెంబ్లీని నడపడంలో శ్రీధర్ బాబు విఫలం అయ్యారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను నేనే ఆపించానని రేవంత్ రెడ్డి అన్నారు.రేవంత్ రెడ్డి మాటలను ఏపీ ప్రభుత్వం ఖండించింది. సీఎం రేవంత్ రెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చాము. రేవంత్ రెడ్డి సమైక్యవాదిలా వ్యవహరిస్తున్నారు.
అసెంబ్లీలో మాకు పీపీటీ అవకాశం ఇవ్వలేదు.రేవంత్ రెడ్డి తప్పులను ఎత్తి చూపితే స్పీకర్ మైక్ ఇవ్వలేనని అన్నారు.రేవంత్ రెడ్డికి మెంటల్ డిజార్డర్ వచ్చినట్లు ఉంది. కేసీఆర్ ను రేవంత్ రెడ్డి అసెంబ్లీకి రావాలని అంటారు.ఆ తర్వాత కేసీఆర్ ను బూతులు తిడతారు.రేవంత్ రెడ్డి వాడే భాష నీచంగా ఉంది. అసెంబ్లీలో ఆన్ రికార్డులో సీఎం బూతులు మాట్లాడుతున్నారు.