– ఈ ఫేక్ న్యూస్ కు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రికి, ముఖ్యమంత్రి-హోంమంత్రి కి, ఆంధ్ర సినిమా లాబీకి ఎక్కడో సంబంధం ఉంది
– సిట్ వేయాల్సింది న్యూస్ ట్యాంపరింగ్ మీద.. ఫోన్ ట్యాపింగ్ మీద కాదు
– నైతిక విలువలు పాటించని ఛానెల్స్ లో పనిచేయొద్దని మహిళా జర్నలిస్టులకు పిలుపు
– మీరు ఏ మొఖం పెట్టుకోని ఇంకా భక్తి , వనిత చానళ్లు, కోటి దీపోత్సవాలు నడిపిస్తారు?
– ఐ బొమ్మ రవికి ఒక న్యాయం ఎన్టీవీ చౌదరికి మరో న్యాయం ఉండకూడదు
– జర్నలిస్టుల అరెస్టును ఎక్స్ వేదికగా ఖండించిన బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్: ఆంధ్ర పెత్తందారీ దాదాగిరి-తెలంగాణ ముఖ్యమంత్రి గులాంగిరి కి మళ్లీ బలి పశువులు అయింది తెలంగాణ బహుజన బిడ్డలే. జర్నలిస్ట్ లు దొంతు రమేష్, చారి, సుధీర్ లను వెంటనే విడుదల చేయండి. వారు కేవలం పావులు మాత్రమే.
ఒక మహిళా ఉన్నతాధికారి – ఒక సీనియర్ మంత్రిపై అసభ్య కరమైన వార్తలను ప్రచురించడం యాదృచ్ఛికం కాదు. ఇది ఒక లోతైన కుట్ర తోనే జరిగిందని నా అభిప్రాయం. నిజానికి పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకొని రోకలిబండలు ఎక్కించాల్సింది ఎన్టీవీ ఛైర్మన్ మీద. నిజానికి మీరు సిట్ వేయాల్సింది టెలిఫోన్ ట్యాపింగ్ మీద కాదు, న్యూస్ ట్యాంపరింగ్ మీద.
ఆయన పర్మిషన్ లేకుండా ఇలాంటి సెన్సేషనల్ వార్తలు రావు. ఛైర్మన్ కు రోకలిబండలు ఎక్కియ్యకుండా ఈ ‘కుట్ర’ ఎవరి సూచన మేరకు జరిగింది అన్నది తెలిసే అవకాశం లేదు. అది చేయకుండా ఆ వార్తను రిలే చేసిన చిన్న చిన్న తెలంగాణ ఛానల్స్ పై కేసు పెట్టడం ‘ఎవరినో’ కాపాడడానికి, ఎవరి మీదనో కక్ష తీర్చుకోవడానికి చేస్తున్న హడావిడి అనేది క్లియర్ గా తెలుస్తోంది .
ఈ ఫేక్ న్యూస్ కు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రికి, ముఖ్యమంత్రి-హోంమంత్రి కి, ఆంధ్ర సినిమా లాబీకి ఎక్కడో సంబంధం ఉంది. ఇక్కడ ఏదో లోతైన కుట్ర విచ్చలవిడి అక్రమ సంపాదన కోసం జరిగింది. అత్యాచారం కేసులో చనిపోయిన దిశ- నేడు వికృత రాజకీయ క్రీడలో బలి అవుతున్న మహిళా ఉద్యోగులు వేరు వేరు కాదు.
ఐబొమ్మ రవికి ఒక న్యాయం ఎన్టీవీ చౌదరికి మరో న్యాయం ఉండకూడదు. మీరు ఆయన్ని అదుపులోకి తీసుకోకపోతే నిజం చెప్పించక పోతే మీరు ప్రభుత్వ అధినేతను కాపాడడానికి అటెన్షన్ డైవర్ట్ చేస్తున్నారు అని అనుకోవాల్సి ఉంటుంది.
సజ్జన్నార్ గారూ?
ఆంధ్ర పెత్తందారీ చానల్లకు ఒకన్యాయం, తెలంగాణ చానళ్లకు, జర్నలిస్టులకు మరో న్యాయం ఎట్ల ఉంటది రేవంత్‌రెడ్డి? డీజీపీ గారూ? ఎన్టీవీ ఎంటర్‌టైన్‌మెంట్ మహిళల మీద ఘోరమైన ఫేక్ న్యూస్ (మీరే ఒప్పుకున్నారు) నడిపే మీరు ఏ మొఖం పెట్టుకోని ఇంకా భక్తి , వనిత చానళ్లు, కోటి దీపోత్సవాలు నడిపిస్తారు?