– ఢిల్లీ ఎయిమ్స్‌ను నిర్మించింది నెహ్రూ కాదా?
– అది ఒక రాజకుమారి ఇచ్చిన దానంతో నిర్మించిన ఆసుపత్రా?
– నెహ్రు దానిని ప్రచారం కోసం వాడుకుని చరిత్రను వక్రీకరించారా?
– 190 ఎకరాల ఎయిమ్స్ భూమి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాదు
– అది అమృత్ కౌర్ వ్యక్తిగత కుటుంబ ఆస్తి
– ఎయిమ్స్ నిర్మాణం.. నమ్మలేని నిజాలు
“స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో భారతదేశం దగ్గర చిల్లిగవ్వ లేదు.
కాంగ్రెస్ దగ్గర నినాదాలు తప్ప వనరులు లేవు.” అయినా సరే… ఢిల్లీ నడిబొడ్డున వేల కోట్ల విలువైన సామ్రాజ్యం లాంటి ‘ఎయిమ్స్’ వెలిసింది.
చరిత్ర పుస్తకాల్లో “నెహ్రూ ఎయిమ్స్ నిర్మించారు” అని రాశారు. అది చరిత్ర కాదు… పచ్చి అబద్ధం, కేవలం ఒక ప్రచార అస్త్రం అందరూ అనుకుంటున్నట్టు ఇది నెహ్రూ విజన్ కాదు.. ఒక మహిళా త్యాగధని రక్తం, చెమట, ఆమె దానం చేసిన ఆస్తి!
చరిత్రను తిరగరాస్తే తప్ప నిజాలు బయటకు రావు:
భూమి ఆమెది – క్రెడిట్ కాంగ్రెస్ ది:
ఢిల్లీలోని అన్సారీ నగర్‌లో ఉన్న సుమారు 190 ఎకరాల ఎయిమ్స్ భూమి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాదు. అది అమృత్ కౌర్ వ్యక్తిగత కుటుంబ ఆస్తి.
ప్రభుత్వం సేకరించలేదు.. కొనలేదు.. ఆమె తన సొంత ఆస్తిని దేశం కోసం రాసిచ్చారు.
నేడు దాని విలువ అక్షరాలా పదుల వేల కోట్లు. కాంగ్రెస్ ప్రభుత్వం దీని కోసం ఒక్క పైసా ఖర్చు చేయలేదు.
నిధులు ఆమె తెచ్చారు – రిబ్బన్ నెహ్రూ కట్ చేశారు:
ప్రభుత్వం దగ్గర డబ్బు లేకపోతే, అమృత్ కౌర్ స్వయంగా రంగంలోకి దిగారు:
* న్యూజిలాండ్ నుండి విదేశీ సాయం తెచ్చారు.
* అంతర్జాతీయ వైద్య సహకారాన్ని కుదిర్చారు.
* ఆధునిక పరికరాలు, శిక్షణ మరియు నైపుణ్యాన్ని స్వయంగా ఏర్పాటు చేశారు.
కాంగ్రెస్ దగ్గర అంత శక్తి ఉంటే, విదేశీ ప్రభుత్వాల సాయం ఎందుకు అవసరమైంది? నెహ్రూ చేసింది కేవలం పూర్తయ్యాక వచ్చి స్పీచ్ ఇవ్వడం మాత్రమే.
వ్యవస్థతో పోరాటం:
1956లో ఎయిమ్స్ చట్టం నెహ్రూ చొరవ వల్ల రాలేదు. అమృత్ కౌర్ పట్టుదల వల్ల వచ్చింది.
ఆమె ఎవరితో పోరాడారో తెలుసా?
* మొద్దుబారిన బ్యూరోక్రసీతో..
* పట్టించుకోని క్యాబినెట్‌తో..
* కాంగ్రెస్ బద్ధకంతో..
ఆమె ఒత్తిడి తెస్తేనే ఫైళ్లు కదిలాయి.
నెహ్రూ చేసిన అసలు పని ఏంటి?
* అప్పటికే నిర్మించిన వాటికి ఆమోదం తెలపడం.
* వేదికల మీద ఉపన్యాసాలు ఇవ్వడం.
* రిబ్బన్లు కట్ చేయడం.
దీనిని ‘సంస్థ నిర్మాణం’ అనరు..దీనిని ‘పబ్లిసిటీ స్టంట్’ అంటారు.
ఎందుకు దాచారు ఈమె పేరు?
ఎందుకంటే ఈ నిజం బయటకు వస్తే కొన్ని అబద్ధాలు పేకమేడల్లా కూలిపోతాయి:
1. కాంగ్రెస్సే దేశాన్ని నిర్మించింది అనే అబద్ధం.
2. నెహ్రూనే అన్ని సంస్థలను సృష్టించారనే భ్రమ.
ఒక రాజకుమారి ప్రజా ఆరోగ్యం కోసం తన ఆస్తిని త్యాగం చేస్తే..కాంగ్రెస్ ఆ క్రెడిట్ మొత్తాన్ని తన ఖాతాలో వేసుకుంది.
ఏ ‘చంచా’ ఆమెను పొగడడు..
ఏ పాఠ్యపుస్తకం ఆమె గురించి చెప్పదు.
ఎందుకంటే కాంగ్రెస్ చరిత్ర కేవలం ‘ఒక్క ఇంటి పేరు’ చుట్టూనే తిరుగుతుంది.
వాస్తవం ఇది:
ఎయిమ్స్ అమృత్ కౌర్ వారసత్వం.
కాంగ్రెస్ కేవలం దాని మీద రంగులు వేసి, తన పేరు రాసుకున్న పబ్లిసిటీ ఏజెంట్ మాత్రమే!
త్యాగం రాజకుమారిది.. ప్రచారం రాజవంశానిది!
– విశ్వ.ఏ