మొహమ్మద్ రఫీ అన్న ముస్లీమ్ గాయకుణ్ణి గత కొన్ని దశాబ్దులుగా నెత్తిన పెట్టుకున్న ఈ దేశంలో,
మెహ్‌దీహసన్, గులామ్ అలీ వంటి విరోధ దేశ పాకిస్తాన్ గాయకుల్ని సైతం గొప్ప గాయకులుగా అభిమానించిన ఈ దేశంలో,
బిస్మిల్లాహ్ ఖాన్ ముస్లీమ్ అయుండీ.. తాను కాశీని విడిచి ఉండలేను అని అన్న ఈ దేశంలో,
పర్వీన్ సుల్తానా భారతీయ ‘చీరకట్టు’, ‘పెద్దబొట్టు’తో మహాగాయనిగా చలామణి అయిన ఈ దేశంలో-
తాను ముస్లీమ్ మతస్థుణ్ణి కాబట్టే తనకు అవకాశాలు రావట్లేదేమో వంటి మాటలు అన్నారు ఎ.అర్. రహ్మాన్!ఎందుకు రహ్మాన్ అలా అన్నారు? ఏం కోల్పోయి ఆ మాటలు అన్నారు? ఏం కోరుకుని ఆ మాటలు అన్నారు?
రహ్మాన్ చేత మతం అలా మాట్లాడించిందా? ‘ఆ మతం’ కళాకారుణ్ణే కాదు మనిషితనాన్ని కూడా చంపేస్తుందా? ‘ఆ మతం’ వల్ల మన దేశంలో కళ, మనిషితనం మాటిమాటికి ఎందుకు హననం ఔతున్నాయి?
పుట్టుకతో హిందువు అయిన దిలీప్ కుమార్ ఏవో అవసరాలతో, ఏవో కారణాలతో ముస్లీమ్ అయ్యారు. (హిందువుకు ముస్లీమ్‌కు మధ్య తాత్కాలిక క్రిస్టిఅన్‌గా కూడా ఆయన ఉన్నారా?) (అలా ఉన్నారన్న సమాచారమూ చెన్నైలో చెప్పబడుతోంది)
దిలీప్ కుమార్ ఒక ముస్లీమ్‌గా ‘మారి’ ఎ.ఆర్. రహ్మాన్ అయ్యాకే ప్రపంచస్థాయి సంగీత దర్శకుడిగా ఈ దేశంలోని హిందువుల భిక్షగానే ఎదిగారు.
ఎ.ఆర్. రహ్మాన్‌గా ‘మతం మారిన’ ఒక జన్మ హిందువు, హైందవ తలితండ్రులకు పుట్టిన రహ్మాన్ తాను నిజమైన ముస్లీమ్‌ను అని అనుకోవడం ఏ మాత్రం విజ్ఞతో అతడి ఇవాళ్టి ‘ఆ మతం’ మాటలు కూడా ఆ మాత్రం విజ్ఞతే! రహ్మాన్‌కు విజ్ఞతా రాహిత్యం ‘ఆ మతం’ వల్లే వచ్చిందా? ‘ఆ మతం’ విజ్ఞతా రాహిత్యాన్నే ఒక మనిషికి నేర్పుతుందా? ‘ఆ మతం’ అంతేనా?
‘ఆ మతం’ మాటలు ఆడి అవి బెడిసి కొట్టాక ఓ రహ్మాన్! మీరు ఇచ్చిన తదుపరి వివరణ లేదా సంజాయిషీలో కూడా నిజాయితీ లేదే! మీ సంజాయిషీ కూడా సరిగ్గా లేదే… ‘ఆ మతం’ మిమ్మల్ని సరిగ్గా ఉండనివ్వడం లేదా? ‘ఆ మతం’ సరిగ్గా ఉండనివ్వదా?
మొహమ్మద్ రఫీ, బిస్మిల్లా ఖాన్, పర్వీన్ సుల్తానా ఈ ముగ్గురినీ కొంత కాలం పాటు ఓ రహ్మాన్! మీరు రోజూ స్మరించుకుంటూ, మననం చేసుకుంటూ ఉంటే మీకు మన్నన ఉంటుంది ఈ దేశంలో.
రహ్మాన్! మీరు ఇళైయరాజా, కె.జె. ఏసుదాస్ ఇద్దరినీ ఎందుకు మరిచిపోయారు? మతం, కులం రెండిటినీ వదిలేసిన ఇళైయరాజా, కె.జె. ఏసుదాస్ మీకు ఇకనైనా ఆదర్శం అయితే బావుంటుంది.
అంతర్జాతీయ స్థాయి కళాకారుడు, దార్శనిక కళాకారుడు అయ్యాక హే మిస్టర్ రహ్మాన్! మీరు ‘మిస్’ అయింది ఏమిటి? మీరు ఇవాళ ఎందుకు అంతర్జాతీయ స్థాయి నుంచి పాతాళానికి పడిపోయారు? మీరు ‘ఆ మతం’ వ్యక్తిగా పడిపోయారా? ‘ఆ మతం’ వల్ల పడిపోయారా?
ఓ రహ్మాన్! మీరు కళాకారుడైన మనిషా? లేదా ‘ఆ మతం’ మనిషా? మీ సంతానానికైనా మీరు సరైన జవాబు చెప్పగలరా? మీకు జవాబుదారీ తనం ఉందా? ‘ఆ మతం’కు అతీతంగా మీకు జవాబుదారీతనం వస్తుందా? మీరు రానున్న రోజుల్లో ‘ఆ మతం’ వ్యక్తిగా కాకుండా ‘ఒక మనిషిగా’ ఉండగలరా? మిమ్మల్ని ఇంతవాణ్ణి చేసిన హిందువులకు ఋణపడి జీవించగలరా?
– రోచిష్మాన్
9444012279