అయ్యలారా, అమ్మలారా,
అందువల్లో, ఇందువల్లో, ఎందువల్లో
నేను ముస్లీమ్‌ను కాను;
అందువల్లో, ఇందువల్లో, ఎందువల్లో
నేను క్రైస్తవుణ్ణి కాను;
అందువల్లో, ఇందువల్లో, ఎందువల్లో
నేను కమ్యూనిస్ట్‌ను కాను;
అందువల్లో, ఇందువల్లో,
ఎందువల్లో
నేను నాస్తికుణ్ణి కాను;
అందువల్లో, ఇందువల్లో,
ఎందువల్లో
నేను అంబేడ్కరిస్ట్‌ను కాను;
అందువల్లో, ఇందువల్లో, ఎందువల్లో
నేను బౌద్దుణ్ణి కాను.
ఎవడో వచ్చి చెబితే అయిన
ఆర్యుణ్ణి, ద్రావిడుణ్ణి కాను;
నా అంత నేనే అయిన
దళితుణ్ణి కాను;
నేను బహుజనుణ్ణి కాను;
మతం మారిన నపుంసకుణ్ణి కాను;
ఏ వర్గానికో చెందిన భ్రష్టుణ్ణి కాను.
వెనుకబడినవాణ్ణి అని స్వయంగా ప్రకటించుకున్న దగుల్బాజీని కాను;
కులాన్ని మెళ్లో వేలాడేసుకుని
తిరుగుతున్న నికృష్టుణ్ణి కాను;
చదువు, ప్రతిభ లేకుండా
ఎదగాలనుకునే అధముణ్ణి కాను;
విదేశాల రంగుల్ని పూసుకుని
వికారమైపోయిన వాణ్ణి కాను;
విదేశాల డబ్బుతో స్వదేశంలో
చిచ్చు పెట్టే సామాజిక కార్యకర్తను కాను.
నేను చెడిపోయిన వాణ్ణి కాను;
నేను చెడ్డవాణ్ణి కాను;
నేను మేధావిని కాను;
నేను అసాంఘీక శక్తిని కాను.
మోసగాళ్లు రాసిన చరిత్రను నమ్మిన
దద్దమ్మను కాను;
పాఠ్యపుస్తకాన్ని ప్రమాణం అనుకునే
చవటను కాను.
నేను దోషిని కాను;
నేను దేశ ద్రోహిని కాను.
నేను పామరుణ్ణి;
నేను సామాన్యుణ్ణి.
అయ్యలారా, అమ్మలారా,
నేను భారతీయుణ్ణై పుట్టాను;
నేను విశ్వమానవుణ్ణై ఉంటాను.
నన్ను ఉండనిస్తారా?
మీరు నన్ను బతకనిస్తారా?
-రోచిష్మాన్
9444012279