బంగారాన్ని బ్యాన్ చేస్తే బావుండును.
బంగారం ఎవరైనా వీధిలోకి పెట్టుకుని వస్తే అరెస్టు చేయాలి.
ఓన్లీ బంగారం కొనుక్కుని.. లాకర్ లో పెట్టుకోవడం లేదా గోల్డ్ లోను పెట్టుకుందుకు మాత్రమే అనుమతించాలి.
దీనమ్మ జీవితం.. తక్కువ ధర ఉన్నంతకాలం అదే ఎక్కువ ధర అని కొనుక్కోకపోవడం…
ధర పెరిగిన తర్వాత.. పాత ధరలను తలుచుకుని కొనలేక పోయామే అని ఏడవడం.
తరతరాలుగా ఏడిపించడమే దీని కర్తవ్యం.
ఇదే బంగారం చేసిన, చేస్తున్న, చేసే దుర్మార్గం.
పెట్టుకున్నంతసేపు ఆనందపెట్టడం, పెట్టెలో పెట్టేడపుడు భయపెట్టడం.
మనకుంటే గర్వపెట్టడం,
పక్కవాడికుంటే ఈర్షపెట్టడం ఇదే దీని పని.
అతిగా మెరవడం, వేసుకుంటే ఆనందపెట్టడం, పోతే బాధ పెట్టడం ఇదే దీని పని.
తనే మెరవడం, వేరేదేదైనా మెరిస్తే… మెరిసేదంతా బంగారం కాదనడం, ఇదే దీనిపని.
ఇది పెరిగితే పోయె…
దీనితో పాటు దీని చెల్లిని కూడ తనలో పాటు పైకి తీసుకెళ్ళడం ఇదే దీని పని..
వెండి కొని బంగారం అని మరిపిద్దామన్నా కూడ లేకుండా చేసింది.
దిగి రాకపోయావో ఇక నీకు స్వస్తి.
ఇంక మాకు వేరే గత్యంతరం ఏమిలేదు గిల్టు నగా (వన్ గ్రామ్ గోల్డా) శరణం నాస్తి త్వమేవ శరణం మమ.
ఇట్లు
నీ
బంగారం కాదు
-శాతవాహన