– సైట్ విజిట్ వచ్చాక మొదటి టెండర్ రేవంతు బామ్మర్ది సృజన్ రెడ్డికి టెండర్ దక్కింది
– కేసీఆర్ తెలంగాణ తేకుంటే నీ మొఖానికి ముఖ్యమంత్రి అయితవా?
– స్కాంలకు నిలయంగా సింగరేణిని మార్చిండు రేవంత్ రెడ్డి
– జాగ్రత్త పడకుంటే ఐదారేండ్లలో సింగరేణిని ఖతం పట్టిస్తారు.
– సింగరేణి స్కాంలో మంత్రి వివేక్ కు వాటా ఉందా ఎందుకు మౌనం?
– కారు మీద గుద్దే గుద్దుడుకు రేవంతు గూబ గొయ్యి మనాలి
– కాంగ్రెస్ పై పోరులో కలిసి వచ్చిన సీపీఐ కి ధన్యవాదాలు
– చెన్నూరు నియోజకవర్గం, మందమర్రి మున్సిపాలిటీ క్యాతన్ పల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎల్పీ ఉప నేత హరీశ్ రావు ఆగ్రహం
చెన్నూరు: రేవంత్ రెడ్డి కట్టలు పంచుతడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తెలంగాణ భవిష్యత్, సింగరేణి భవిష్యత్తు. గతంలో ఏ ప్రభుత్వం కూడా సింగరేణిలో వేలు పెట్టలేదు. కోల్ ఇండియాకు ఆదర్శంగా సింగరేణి ఉండేది. దేశం మెచ్చుకున్నది, ప్రపంచం మెచ్చుకున్నది. సిరుల గని సింగరేణి, స్కాంలకు నిలయంగా మార్చిండు రేవంత్ రెడ్డి.
బ్యాంకుల్లో అప్పు తెస్తే గాని జీతాలు ఇవ్వని పరిస్థితి. సైట్ విజిట్ పద్దతి తెచ్చి ఓబీ కాంట్రాక్టుల్లో వేల కోట్ల స్కాం చేశారు. అనుయాయులకు టెండర్లు ఇచ్చి, కమీషన్లు పంచుకున్నరు.సైట్ విజిట్ వచ్చాక మొదటి టెండర్ రేవంతు బామ్మర్ది సృజన్ రెడ్డికి టెండర్ దక్కింది. మొత్తం ఆరువేల కోట్ల టెండర్ దక్కించుకున్నరు. స్కాం చేశారు.
బిఆర్ఎస్ హయాంలో అయిన టెండర్లు రద్దు చేసి ప్లస్ 20 శాతంకు టెండర్లు ఇచ్చారు.
తప్పు చేయకుంటే ఎందుకు విచారణ జరపరు, ఎందుకు సిట్టింగ్ జడ్జి విచారణ జరుపరు. . ఎందుకు సిబిఐ విచారణ జరుపరు? శ్రీరాంపూర్ టెండర్ టెక్నికల్ బిడ్ ఓపెన్ చేసి, ఫైనాన్స్ టెండర్ 7 సార్లు తేదీలు మార్చారు. లెక్కలు కుదరడం లేదని వాయిదా వేశారు.డీజిల్ స్కాం, జిలిటెన్ స్టిక్స్ స్కాం, నైనీ కోల్ స్కాం, సోలార్ పవర్ స్కాం చేశారు.బంగారు బాతును కోసుకుతింటున్నరు.
ఇట్లనే పోతే ఐదు, పదేండ్లలో సింగరేణిని ఖతం చేస్తారు.చంద్రబాబు డిపెండెంట్ ఉద్యోగాలు రద్దు చేస్తే కేసీఆర్ పునరుద్దరించారు. నెల నెలా మెడికల్ బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసి 16,500 మంది పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిండు. కాంగ్రెస్ వచ్చాక మెడికల్ బోర్డు బంద్, డిపెండెంట్ ఉద్యోగాలు బంద్ చేసిండు.
నడవలేని వారిని, గుండెకు బై పాస్ సర్జరీ చేసుకున్న వాళ్లను అన్ ఫిట్ చేయడం లేదు. కార్మిక మంత్రిగా ఉన్నడు వివేక్ .కార్మికులకు అన్యాయం జరిగితే ఎందుకు మాట్లాడడు కార్మిక మంత్రి, మీ ఎమ్మెల్యే. అన్యాయం జరిగితే, స్కాంలు జరుగుతుంటే ఎందుకు వివేక్ నోరు విప్పరు. మీకు ఏమైనా వాటా ఉందా? రేవంత్ అన్యాయంపై ఎందుకు మాట్లాడవు.
కాంగ్రెస్ పార్టీ సింగరేణిని ఆగం చేస్తున్నది. అందుకే మా ఏఐటీయూసీ నాయకులు, సీపీఐ నాయకులు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ తో గళం కలిపేందుకు ముందుకు వచ్చారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నాను. కార్మికులు ఇచ్చే బోనస్ కూడా బోగస్ చేసిండు రేవంత్ రెడ్డి.
నిమ్స్ కు తప్ప కార్పొరేట్ ఆసుపత్రుల్లో కార్మికులకు వైద్యం అందకుండా చేసిండు.
రెండేళ్లుగా సింగరేణి సీఎండీని కూడా నియమించలేదు. సింగరేణి స్కాం బయట పెడితే తెల్లారి నాకు రేవంత్ రెడ్డి ప్రేమ లేఖ పంపిండు. నన్ను విచారణకు పిలిచిండు, నోటీసులు పంపిండు. ప్రశ్నించే గొంతులను అణిచివేస్తున్నడు..
కేసీఆర్ తెలంగాణ తేకుంటే నీ మొఖానికి ముఖ్యమంత్రి అయితవా? కేసీఆర్ గురించి ఆయన మాట్లాడుతున్న బాషను ఒప్పుకుంటరా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషనా? పింఛన్ 200 నుంచి 2000 పెంచిండు కేసీఆర్. 26 నెలలుగా అవ్వాతాతలకు 52వేలు బాకీ పడ్డడు. నెలకు 2500 మహిళలకు ఇస్తానని మాట తప్పిండు. ప్రతి అక్కకు చెల్లకు 65వేలు బాకీ పడ్డడు.
కేసీఆర్ ఆడబిడ్డ పెళ్లికి లక్ష ఇస్తా అంటే ఇచ్చారు. రేవంత్ రెడ్డి చెప్పిన తులం బంగారం ఏమైంది? భూముల ధరలు పాతాళానికి, బంగారం ధరలు ఆకాశానికి అంటినయి.. స్కాంల గురించి అడిగితే డైవర్షన్ స్కీంలు అడిగితే డైవర్షన్.
బిడ్డా రేవంత్ రెడ్డి.. నిన్ను కూడా తెలంగాణ ప్రజలు డైవర్షన్ పెడుతరు.కరోనాలో కూడా కేసీఆర్ రైతు బంధు ఇచ్చిండు.
రేవంత్ రెడ్డి రెండు ఇచ్చి మూడు ఎగ్గొట్టిండు. ఫిబ్రవరి నెల వచ్చినా రైతు బంధు పడలేదు.. కరోనాలో కేసీఆర్ మూడు నెలలు పాటు బియ్యం ఇచ్చిండు.. జిల్లా కల సాకారం చేసిండు కేసీఆర్. మెడికల్ కాలేజీ ఇచ్చిండు..
చెన్నూరు రెవెన్యూ డివిజన్ చేసిండు.